కల్కి : శంకర్ నుంచి ఆ మాట రావడం గొప్ప

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

Update: 2024-07-03 12:06 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి వెయ్యి కోట్ల క్లబ్‌ లో ఈ సినిమా చేరుతుందా అనే ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తోంది.

సినిమాకు రివ్యూవర్స్‌ ఇచ్చిన రివ్యూలు, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కాకుండా సినిమా ప్రముఖుల నుంచి వస్తున్న కామెంట్స్ మరియు రివ్యూల కారణంగా ఆధరణ మరింతగా పెరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి.

బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషలకు చెందిన నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు కల్కి సినిమాను చూసిన తర్వాత వావ్‌.. ఇండియన్ సినిమా కు ఇది గర్వకారణం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దర్శక దిగ్గజం, లెజెండ్రీ డైరెక్టర్‌ శంకర్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కమల్‌ హాసన్‌ తో శంకర్‌ రూపొందించిన ఇండియన్‌ 2 సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. జులై 12న విడుదల అవ్వబోతున్న ఇండియన్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ కల్కి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, అవి వైరల్‌ అవ్వడం జరిగింది.

Read more!

శంకర్ మాట్లాడుతూ... నేను ఇటీవల కల్కి సినిమాను చూశాను. భారతీయ సినిమాకు కల్కి గర్వకారణం. నేను గతంలోనే ఈ ఫలితాన్ని అంచనా వేసి చెప్పాను. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే వెయ్యి కోట్లకు పైగా ఈ సినిమా సాధిస్తుంది. ఇప్పుడు ఆ దిశగా కల్కి పరుగులు తీస్తోందని అన్నాడు.

కల్కి గురించి దర్శకుడు శంకర్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం చాలా గొప్ప విషయం. కల్కి ని ఎంత మంది ఆకాశానికి ఎత్తినా కూడా శంకర్ వంటి దర్శకుడు ప్రశంసించడం ఒక ఎత్తు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News

eac