వాళ్లిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఏకంగా ర‌న్నింగే!

శ్ర‌ద్దాక‌పూర్-రాహుల్ మోడీ మ‌ధ్య రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే. ఇద్ద‌రు కొంత కాలంగా ఎంతో స్వేచ్ఛ‌గా విహ‌రిస్తున్నారు.

Update: 2024-06-19 07:08 GMT

శ్ర‌ద్దాక‌పూర్-రాహుల్ మోడీ మ‌ధ్య రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే. ఇద్ద‌రు కొంత కాలంగా ఎంతో స్వేచ్ఛ‌గా విహ‌రిస్తున్నారు. ప్రేమ‌లో మ‌ధురానుభూతులు ఆస్వాదిస్తున్నారు. విష‌యం అధికారికం కాన‌ప్ప‌టికీ వాళ్ల మ‌ధ్య బాండింగ్ పీక్స్ లో ఉంద‌న్న‌ది న‌గ్న స‌త్యం. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సంద‌ర్భంగా దొరికిన జోడీ అప్పటి నుంచి ముంబైలో ప్ర‌తీ చోట మీడియా కంట చిక్కుతున్న‌వారే.

క‌లిసి ప్ర‌యాణాలు చేయ‌డం, ప‌బ్ ల‌కు వెళ్ల‌డం, పార్టీల్లో పాల్గొన‌డం ఒకటేంటి? ప్ర‌తీ చోట ఈ జోడీ క‌ని పిస్తూనే ఉంది. తాజాగా శ్ర‌ద్దా క‌పూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీరిద్దరి సెల్ఫీని షేర్ చేసింది. `దిల్ రఖ్ లే, నీంద్ తో వాపిస్ దే దే యార్` అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీన‌ర్దం ఏంటంటే? ‘నా హృదయాన్ని కాపాడు. కానీ కనీస శాంతితో నిద్రపోనివ్వు’ అని అర్థం. ఓ హృదయం, నవ్వించే ఎమోజీలను కూడా జోడించింది.

దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ న‌డ‌వ‌డం కాదు ప‌రుగులే పెడుతుంద‌ని నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ మోడీ న‌టుడు కాదన్న సంగ‌తి తెలిసిందే. అత‌డో ర‌చ‌యిత‌. `ప్యార్ కా పంచ్‌నామా`, సోనూ కే టిటు కి స్వీటీ` ,`ప్యార్ కా పంచ్‌నామా 2` వంటి చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ర‌చ‌యిత‌గా అత‌డిలో ప్ర‌తిభ‌ను గుర్తించిన శ్ర‌ద్దా క‌పూర్ అత‌డితో ప్రేమ‌లో ప‌డిపోయింది. అయితే ఇలాంటి ప్రేమ‌లు శ్ర‌ద్దా క‌పూర్ కి కొత్తేం కాదు.

గ‌తంలో ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. కొన్నాళ్ల‌కు మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడిపోయారు. అలాగే `ఆషీకీ-2` హీరో ఆదిత్యారాయ్ క‌పూర్ తో కూడా స‌హ‌జీవ‌నం చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. కానీ ఆ బంధం కూడా కొన్నాళ్లే కొన‌సాగింది. ప్ర‌స్తుతం శ్ర‌ద్దా క‌పూర్ కెరీర్ పరంగా బిజీగానే ఉంది. `స్త్రీ-2` లో న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే అమ్మ‌డు మరికొన్ని సినిమాల‌కు కమిట్ అయింది.

Tags:    

Similar News