క్యాన్సర్ తో బాధపడుతున్నా..అందుకే సినిమా చేయలేదు!
బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా ఠాకూర్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు
బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా ఠాకూర్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిథ్యమైన చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తనదైన చిత్రాలతో బాలీవుడ్ లో చెరగని ముద్రవేసారు. 'ది వరల్డ్ ఆప్ అపు'..'దేవి'..'కశ్మీర్ కీ కలి'..'ఆరాధన'..'అమర్ ప్రేమ్' లాంటి చిత్రాలతో ప్రత్యేకతని చాటారు. తాజాగా షర్మిలా ఠాకూర్ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కి నో చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో నటించమని నన్ను కలిసి కరణ్ అడిగారు. ఎలాగైనా ఆ పాత్ర మీరు పోషిస్తే బాగుంటుందని ఎంతగానో అభ్యర్దించారు. అలియాభట్ కుటుంబంలో భాగమైతే ఎంతో సంతోషమని అన్నారు. కానీ ఆయనకి నేను చెప్పాను. ఎంతగానో ఇబ్బంది పెట్టాను. అందుకు ఓ బలమైన కారణం ఉంది. ఆ సమయంలో నేను క్యాన్సర్ తో బాధపడుతున్నాను. అదే సమయంలో కోవిడ్ కూడా ఉదృతంగా.
బయటకు రాలేని పరిస్థితులున్నాయి. అందువల్ల నేను రిస్క్ తీసుకోలేనని చెప్పాను. కానీ కరణ్ సినిమా చేయలేదు అన్న బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. వచ్చిన అవకాశం మిస్ చేసుకున్నానా? అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు కలుగుతుంది. ఎప్పటికైనా ఆయన చిత్రంలో నటించాలని ఆశిస్తున్నాను. మళ్లీ అవకాశం ఇవ్వమని నేనే ఆయన్ని ఏదో రోజు అడుగుతాను' అని అన్నారు.
ఇదే ఏడాది షర్మిలా ఠాకూర్ మనోజ్ బాజ్ పాయ్ తో కలిసి 'గులమ్ మోహర్' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించారు. ఆ ధీమాతోనే కరణ్ జోహర్ తన సినిమాలో నటిస్తుంది? అని భావించి సీనియర్ నటిని అడిగినట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు ఆమె నుంచి చుక్కెదురైంది. ఇక రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితాలు ఏమంత ఆశాజనకంగా లేవు అన్న సంగతి తెలిసిందే.