శర్వా గేమ్ ప్లాన్ మార్చాల్సిందే..?
సినిమా సక్సెస్ లో ఎక్కువ శాతం యూత్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది.
కెరీర్ మొదట్లో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ హీరోగా తనకంటూ ఒక మార్కెట్ తెచ్చుకున్నాక మాత్రం తన సినిమాలతో మెప్పించలేకపోతున్నాడు. ఇప్పటికీ కథల విషయంలో తన ప్రత్యేకత చూపుతున్నా అవేవి ప్రేక్షకులను మెప్పించలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. శర్వానంద్ ఈమధ్య ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేయడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు విశ్లేషకులు. అదేంటి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తే సినిమా సూపర్ హిట్ కదా అనుకోవచ్చు.
సినిమా సక్సెస్ లో ఎక్కువ శాతం యూత్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. రిలీజ్ రోజు కాలేజ్ ఎగ్గొట్టి మరీ సినిమా చూసేది వారే. అలాంటి యూత్ ఆడియన్స్ కు ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ పెద్దగా రుచించవు. అఫ్కోర్స్ మంచి క్లీన్ ఎంటర్ టైనర్ సినిమా చూడాలి అనుకునే వారికి శర్వానంద్ సినిమాలు నచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతిసారి అలాంటి సినిమా అంటే ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు.
చేయడానికి డిఫరెంట్ కథలే అనిపించినా యూత్ ఆడియన్స్ ని కచ్చితంగా చూడాలి అనిపించేలా శర్వానంద్ సినిమాలు రావట్లేదు. అందుకే శర్వానంద్ తన గేమ్ ప్లాన్ మారిస్తే కానీ వర్క్ అవుట్ అయ్యేలా లేదని చెప్పుకుంటున్నారు. మహానుభావుడు తర్వాత శర్వానంద్ సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా లేదు. రీసెంట్ గా వచ్చిన మనమే సినిమా పర్వాలేదు అనిపించినా ఆడియన్స్ అంతా కూడా ప్రత్యేకంగా మాట్లాడేలా చేసుకోలేదు.
అందుకే శర్వానంద్ తన రూట్ మార్చి వెరైటీ సినిమాలు చేస్తే తప్ప కెరీర్ మళ్లీ జోరందుకునే అవకాశం కనిపించట్లేదు. మరి ఈ విషయంలో శర్వానంద్ ఏమనుకుంటున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. శర్వానంద్ ఈ టైం లో జాగ్రత్త పడకపోతే మాత్రం కెరీర్ లో ఇంకా వెనకపడే పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు. యువ హీరోలంతా కూడా యూత్ పల్స్ పట్టేసి డిఫరెంట్ స్టోరీస్, క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలకే ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ శర్వానంద్ మాత్రం తన సేఫ్ రూట్ నుంచి బయటకు రావాలని అనుకోవట్లేదు. అందుకే కెరీర్ మరీ రిస్క్ లో పడకముందే శర్వా కూడా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటే బెటర్ అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి శర్వానంద్ నెక్స్ట్ సినిమాల విషయంలో అయినా తన నిర్ణయాలను మార్చుకుంటాడేమో చూడాలి .