శౌర్యాంగ పర్వం.. ఎన్నో ప్రశ్నలు.. నీల్ ఏం చేస్తారో?
కచ్చితంగా చూడాలి అన్నంత హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సెకెండ్ పార్ట్ లోఎన్నో డౌట్లు క్లియర్ చేయాల్సి ఉందని సినీ పండితులు చెబుతున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ వచ్చేసింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు, ప్రభాస్ మాస్ యాక్షన్ అదిరిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ దుమ్ముదులిపేశాయి. ఫ్యాన్స్ కుర్చీల్లో కూర్చోనివ్వకుండా చేశాయి. ఈలలు వేయిస్తూనే ఉన్నాయి. తర్వాత ఏంటి? మరి.. ఇక ఫ్యాన్స్ అంతా సలార్ పార్ట్-2 కోసం వెయిటింగ్.
అయితే సలార్-1 చివర్లోనే సీక్వెల్ టైటిల్ను సలార్ - శౌర్యంగ పర్వంగా ప్రశాంత్ నీల్ ప్రకటించేశారు. ఆ పేరుతోనే ఫస్ట్ పార్ట్ కు ఎండ్ కార్డు పడిన విషయం తెలిసిందే. టైటిల్ తోనే సెకెండ్ పార్ట్ పై మరిన్ని అంచనాలు పెంచేశారు ప్రశాంత్ నీల్. కచ్చితంగా చూడాలి అన్నంత హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సెకెండ్ పార్ట్ లో ఎన్నో డౌట్లు క్లియర్ చేయాల్సి ఉందని సినీ పండితులు చెబుతున్నారు.
అందులో ముఖ్యంగా దేవా తండ్రి ఎవరనేది నీల్ చెప్పాల్సి ఉంది. అయితే ఈ పాత్ర కూడా ప్రభాసే చేశారని గతంలో వార్తలు వచ్చాయి. సలార్ పార్ట్-1లో ఈశ్వరీ రావు భర్త ఎవరనేది వీక్షకులకు గుర్తుకు రాకుండా మేనేజ్ చేశారు. హీరోయిన్ శ్రుతిహాసన్ ను విలన్ లు ఎందుకు వెంటాడుతున్నారనేది ప్రేక్షకులకు ప్రశ్నగానే మిగిలిపోయింది. వీటన్నంటికి పార్ట్-2లో సమాధానం చెప్పాలి నీల్.
వీటితోపాటు జగపతిబాబు క్యారెక్టర్ పార్ట్-1లో అభిమానులు ఊహించినంత స్పేస్ లేదు. కాబట్టి ఆయన పార్ట్-2లో కీలకం కాబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్.. తన జాతికి దేవా చేసిన ద్రోహం కోసం ఎందుకు నిలదీయలేదనే డౌట్ అందరికీ వచ్చింది. ఇద్దరూ విడిపోవడానికి అసలైన కారణం చూపించలేదు. దేవాకు ఆద్యపై ప్రేమ పుట్టిందో లేదో చెప్పలేదు. ప్రభాస్, శ్రుతి మధ్య స్పెషల్ సాంగ్ అన్నారు.. అది కూడా లేదు. అలా చాలా క్వశ్చన్స్ కు సలార్-2 లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.
అందుకే సలార్-2 షూటింగ్ త్వరగా మొదలపెట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాలా అంచనాలు పెట్టుకున్నామని, త్వరగా స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కమిట్ అయ్యారు. కాబట్టి సలార్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. కానీ స్క్రిప్ట్ మాత్రం రెడీగా ఉందని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి.
మరోవైపు, బాక్సాఫీస్ వద్ద సలార్ మూవీ భారీ వసూళ్లు రాబడుతోంది. రెండో రోజు కూడా రూ.100 కోట్ల మార్క్ అందుకుని మొత్తంగా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే మూడో రోజు ఆదివారం కూడా సలార్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయని చెబుతున్నారు.