లైవ్ లో ప్రముఖ దర్శకుడిని తిట్టేసింది..!

మరో రెండు రోజుల్లో రాబోతున్న కీడా కోలా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ఒక వైపు మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలతో తరుణ్‌ భాస్కర్‌ బిజీగా ఉన్నాడు.

Update: 2023-11-01 08:14 GMT

దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు అతడు ఎంత పెద్ద దర్శకుడు అయినా, ఎంత క్రేజ్ ఉన్న స్టార్ అయినా కూడా తల్లికి కొడుకే. ఆ తల్లి వద్ద చిన్న పిల్లాడే. తాజాగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తన తల్లి పుట్టిన రోజు విషెష్ ను ఆలస్యంగా చెప్పడంతో ఆ తల్లి ఇంత ఆలస్యంగానే విషెష్‌ చెప్పేది అంటూ సరదాగా కొడుకును తిడుతున్న వీడియో వైరల్‌ అవుతోంది.

తరుణ్‌ భాస్కర్‌ తన కొత్త సినిమా కీడా కోలా ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు రోజుల్లో రాబోతున్న కీడా కోలా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ఒక వైపు మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలతో తరుణ్‌ భాస్కర్‌ బిజీగా ఉన్నాడు. దాంతో తల్లి పుట్టిన రోజున ఆమెకు ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పాడు.

గీతా భాస్కర్‌ తన కొడుకు తరుణ్ భాస్కర్‌ ను తిడుతున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను ఇన్ స్టా లైవ్‌ లో ఉన్నాను అంటూ తరుణ్ భాస్కర్‌ చెప్పినా కూడా ఆమె తన కొడుకును ప్రేమగా తిడుతూ తన కోపం ను ప్రదర్శించింది. ఈ వీడియో తల్లి కొడుకుల మధ్య ఉన్న అన్యోన్యతను చూపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా భాస్కర్‌ కూడా నటి అనే విషయం తెల్సిందే. ఆమె అనుకోకుండా శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. పక్కింటి పెద్దమ్మ మాదిరిగా కనిపించే గీతా భాస్కర్ కి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఆమె మాత్రం నటన పై ఎక్కువ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తన కొడుకు దర్శకత్వం లో అయినా ఆమె నటిస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News