బిగ్ బాస్ 8 : శేఖర్ బాషా కోరి బయటకు వచ్చాడా..?

హౌస్ లో ఆటలు సరిగా ఆడకపోయినా తన కామెడీతో మెప్పిస్తూ అందరితో సరదాగా ఉంటున్నాడు శేఖర్ బాషా.

Update: 2024-09-16 14:30 GMT

బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రెండో ఎలిమినేషన్ గా శేఖర్ బాషా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. మొదటి వారం బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా రెండో వారం ఊహించని విధంగా శేఖర్ బాషా ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఐతే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా శేఖర్ బాషా, ఆదిత్య ఓం లీస్ట్ పొజిషన్ లో ఉండగా ఆడియన్స్ పోల్ కాకుండా ఈసారి హౌస్ మెట్స్ పోల్ తో శేఖర్ బాషాని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఐతే ఈ ఎలిమినేషన్ పై ఆడియన్స్ అంతా కూడా అన్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు.

హౌస్ లో ఆటలు సరిగా ఆడకపోయినా తన కామెడీతో మెప్పిస్తూ అందరితో సరదాగా ఉంటున్నాడు శేఖర్ బాషా. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్ లెస్ లో భాగంగా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కంటెస్టెంట్స్ చేతుల్లో పెట్టారు. ఐతే శేఖర్ బాషా తన ఎలిమినేషన్ పై ముందే గెస్ చేసినట్టు మీడియాతో చెబుతున్నారు. ఇన్ని సీజన్లలో ఇంత సంతోషంగా బయటకు వచ్చింది తనే అని అంటున్నాడు. తానే బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చానని అంటున్నాడు.

శేఖర్ బాషాకి రెండు రోజుల క్రితమే బాబు పుట్టాడని నాగార్జున అనౌన్స్ చేశారు. ఐతే కొడుకు పుట్టాడన్న ఆనందంతో వెంటనే ఇంటికి వెళ్లాలని శేఖర్ బాషా నిర్ణయం తీసుకునే అదేదో ఎలిమినేట్ అయినట్టుగా వెళ్తే బెటర్ అని భావించాడట. అలా హౌస్ మెట్స్ ని కన్విన్స్ చేస్ వచ్చాడని అంటున్నారు. ఐతే ఇలా హౌస్ మెట్స్ ఓటింగ్ తో వెళ్లిన ప్రతి ఒక్కరు మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఒకవేళ శేఖర్ బాషా మళ్లీ హౌస్ లోకి వస్తారేమో చూడాలి.

ఎలిమినేషన్ తర్వాత శేఖర్ బాషా మీడియాతో కూడా ఏమో మళ్లీ వెళ్లొచ్చేమో అన్నట్టుగా చెబుతున్నాడు. సో ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే శేఖర్ బాషా మళ్లీ హౌస్ లోకి వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. శేఖర్ బాషా వెళ్లడంతో హౌస్ లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం 3 క్లాన్లు, ముగ్గురు చీఫ్ లు ఉండగా ఈ వారం ఇద్దరు చీఫ్ లు రెండు క్లాన్స్ మాత్రమే ఉన్నాయి. నిఖిల్ క్లాన్ లో ఐదుగురు, అభయ్ క్లాన్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

Tags:    

Similar News