భార్య‌తో స‌ఖ్య‌త‌ లేద‌ని ద‌ర్శ‌కుడు చెత్త‌గా మాట్లాడాడు!

బాలీవుడ్ లో లైంగిక వేధింపుల‌పై న‌టీమ‌ణులంతా ఎప్పుడో ఓపెన్ అయిపోయారు. కాస్టింగ్ కౌచ్ లో భాగంగా ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న అంశాల్ని ఇప్ప‌టికే చాలా మంది పూస‌గుచ్చారు.

Update: 2023-07-23 12:36 GMT

బాలీవుడ్ లో లైంగిక వేధింపుల‌పై న‌టీమ‌ణులంతా ఎప్పుడో ఓపెన్ అయిపోయారు. కాస్టింగ్ కౌచ్ లో భాగంగా ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న అంశాల్ని ఇప్ప‌టికే చాలా మంది పూస‌గుచ్చారు. తాజాగా హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అనుభ‌వాలు గురించి చెప్పుకొచ్చింది. ``సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నం చేస్తోన్న స‌మ‌యంలో కొంత మంది ద‌ర్శ‌కులు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది ప‌డేలా అస‌భ్యంగా మాట్లాడేవారు. ప్ర‌యివేట్ బాగాల్ని తాకాల‌ని చూసేవారు.

ఓ దర్శ‌కుడు మితిమీరి మాట్లాడ‌గా? మీకు పెళ్లైంది? ఆ విష‌యం మ‌ర్చిపోవ‌ద్దుని రివ‌ర్స్ లో స‌మాధానం ఇచ్చాను. దానికి ఆయ‌న ఎంతో రిలాక్స్ గా ఏమ‌న్నాడో తెలుసా? మాది పెద్ద‌లు కుదుర్చిన వివాహం. మా మ‌ధ్య స‌రైన స‌ఖ్య‌త లేదు అని అన్నాడు. అప్ప‌టికే అత‌డి చేష్ట‌ల‌తో విసిగిపోయి న‌న్ను ఆ మాట‌లు చెప్పి మ‌రింత చిరార‌కు తెప్పించాడు. దీంతో సినిమాలో ఛాన్స్ వ‌ద్దులే అనుకుని అక్క‌డ నుంచి వ‌చ్చేసాను.

ఇలాంటి వాళ్లు సినిమాల్లోనేకాదు బ‌య‌ట కూడా చాలా మంది ఉన్నారు. అవ‌కాశం కోసం వెళ్తే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించే వారికి అదే ప‌ని` అని తెలిపింది. అలాగే షెర్లిన్ చోప్రా కిడ్నీ ఫెయిల్యూర్ గురించి స్పందించింది. 2021లో నాకు కిడ్నీ ఫెయిలైంది. నా జీవితం ఎంతో క్లిష్టంగా మారింది. ఆరోజుల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. కుటుంబ స‌భ్యులు సైతం సాయం చేయ‌డానికి ముందుకు రాలేదు. పైపెచ్చి తెలిసిన వారు కూడా ఆ స‌మ‌యంలో ముఖం చాటేసేవారు.

నాతో మాట్లాడటానికే ఇష్ట‌ప‌డేవారు కాదు. కానీ నేను నాజీవితాన్ని సంపూర్ణంగా జీవించాల‌నుకున్నా. ఆ నిర్ణయంతో బ‌లంగా ముందుకు వెళ్ల‌ను. స‌మ‌స్య‌లు ఎదురైనా అధిగ‌మించి నిల‌బ‌డ్డాను` అంది. షెర్లిన్ చోప్రా తెలుగులోనూ సినిమాలు చేసింది.

`ఏ పిల్మ్ బై అర‌వింద్` లో న‌టించింది. ఆసినిమాకి విమ‌ర్శ‌కు లు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత `స‌మ్ థింగ్ స్పెష‌ల్` అనే మ‌రో సినిమాలోనూ న‌టించింది. బాలీవుడ్ లో ఎక్కువ‌గా సినిమాలు చేసింది. అయితే మూడేళ్ల‌గా అక్క‌డా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. చివ‌రిగా `చ‌మేలి` లో న‌టించింది.

Tags:    

Similar News