జాన్వీ కపూర్ కోరుకున్నవన్నీ అతడిలో ఉన్నాయా?
తాజాగా జాన్వీ కపూర్ కూడా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో రివీల్ చేసింది.
కాబోయే జీవిత భాగస్వామి విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికలు..ఫ్యాంటసీలు కలిగి ఉంటారు. ప్రోషెషనల్ గా అలా ఉండాలి..వ్యక్తిగత జీవితంలో ఇలా ఉండాలి అంటూ రకరకాల ఎక్స్ పక్టేషన్స్ తో ఉంటారు. అలాంటి వాడు తారస పడినప్పడు తప్పకుండా పెళ్లి చేసుకుంటామని హీరోయిన్లు అంతా చెబుతుంటారు. తాజాగా జాన్వీ కపూర్ కూడా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో రివీల్ చేసింది. తన కలలని అతడి కలలుగా భావించే వాడై ఉండాలిట. అమ్మడికి ఎల్లప్పుడు సంతోషాన్ని పంచే స్వభావం కలిగి ఉండాలి.
అలాగే అంతే నవ్వించాలి కూడా. నిరాశనిస్పృహలు సందర్భాన్ని బట్టి ఉండాలి తప్ప! ఎప్పుడూ మూడీగా ఉండకూడదు అంటోంది. అలాగే తను భాధలో ఉన్నప్పడు దైర్యం చెప్పగలగాలి అంటోంది.ప్రతీ విషయంలో అండగా నిలవాలి. ఇవన్నీ జీవిత భాగస్వామి విషయంలో తప్పనసరిగా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి శిఖర్ పహారియాలో ఇవన్నీ ఉన్నాయా? అన్నది చెక్ చేయాలి సుమీ. అమ్మడు కొంత కాలంగా అతగాడి ప్రేమలో ఉన్నట్లు కథనాలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ టాక్ షోలో సైతం పహారియా ఫోన్ నెంబర్ కి ఉన్న ప్రయార్టీ గురించి ఓపెన్ అయింది.
ఇక ముంబై లో చూసినా...ఇతర రాష్ట్రాల్లో చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు గుడులు గోపురాలు చుట్టేస్తోన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. జాన్వీకి ఖాళీ అయితే చాలు ప్రియుడిని వెంటేసుకుని హిందు దేవాలయాలన్నింటిని చుట్టేస్తోంది. మరి ఇవన్ని దేనికి ఇండికేషన్? జాన్వీ కోరుకున్న లక్షణాలన్ని శిఖర్ పహారియాలో ఉన్నాయా? లేక కొన్నాళ్ల పాటు కొనసాగే రిలేషన్ షిప్ మాత్రమేనా? అన్నది తేలాల్సిన విషయం.
ఒక వృత్తి పరంగా జాన్వీ కపూర్ స్పీడ్ చూస్తూనే ఉన్నాం. తెలుగు..హిందీ రెండు భాషల్ని దున్నేస్తుంది. తెలుగులో జూనియర్ ఎన్టిఆర్ తో కలసి `దేవర` సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. అలాగే రామ్ చరణ్ 16వ సినిమాలోనూ ఈ అమ్మడినే హీరోయిన్ గా ఫైనల్ చేసారు. ఇక హిదీలో రెండు..మూడు సినిమాలు చేస్తోంది. `మిస్టర్ అండ్ మిసెస్ మహి` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ భార్య పాత్ర పోషించింది.