హిందీ 'బిగ్ బాస్‌'లో మ‌హేష్ ఇంటి సీక్రెట్స్ లీక్?

తాజా స‌మాచారం మేర‌కు.. ఈసారి ఇంటి స‌భ్యుల‌లో మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లు శిల్పా శిరోద్కర్ ఉన్నారు. ఆమె న‌మ్ర‌త శిరోద్క‌ర్ కి స్వ‌యానా సోద‌రి.

Update: 2024-09-23 15:36 GMT

ప్రాంతీయ భాష‌ల్లో బిగ్ బాస్ షోలు ఎన్ని ఉన్నా, హిందీ బిగ్ బాస్ వేరే లెవ‌ల్. అక్క‌డ ర‌క్తి క‌ట్టించ‌డానికి క్రిమిన‌ల్స్ కూడా బిగ్ బాస్ లో చేర‌తారు. వివాదాస్ప‌దులు, వింతైన మ‌నుషుల‌ను మాత్ర‌మే ప్ర‌మోట్ చేసే బిగ్ బాస్ కోసం వారంతా చేసే విన్యాసాలు వేరు. సాంప్ర‌దాయ వాదులు చెప్పిన‌ట్టు బార్డ‌ర్ దాటి బోల్డ్ గా చాలా చేస్తారిక్క‌డ‌. ఇది మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ అల‌రిస్తోంది.

ఇలాంటి షోలోకి మ‌హేష్ బాబూ తాలూకా ఒక‌రు ప్ర‌వేశిస్తున్నారు అంటే అది ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు పెద్ద వార్త‌. బాలీవుడ్ బిగ్ బాస్ 18 సీజన్ అక్టోబర్ 6న ప్రీమియర్ కానుంది. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షో నిర్మాతలు 'గతం, వర్తమానం, భవిష్యత్తు' అంటూ ఒక ప్రత్యేకమైన థీమ్‌తో అద్భుతమైన ప్రారంభం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఈ సీజన్ వీక్షకుల ఆసక్తిని రేకెత్తించే భవిష్యత్ కాన్సెప్టుతో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ట‌. ఈసారి ఇంటి డిజైన్‌ను మార్చారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈసారి ఇంటి స‌భ్యుల‌లో మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లు శిల్పా శిరోద్కర్ ఉన్నారు. ఆమె న‌మ్ర‌త శిరోద్క‌ర్ కి స్వ‌యానా సోద‌రి. శిల్పా ఈ షోలో చేర‌డంతో ఇప్పుడు ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో హిందీ బిగ్ బాస్ గురించి ఆస‌క్తి మొద‌లైంది. శిల్పా త‌న సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ గురించి ఎలాంటి విష‌యాలు బిగ్ బాస్ షోలో చెబుతుందో చూడాల‌న్న కుతూహాలం వారికి ఉంటుంది. మ‌హేష్ కుటుంబంలో ప్ర‌తి ఈవెంట్లో క‌నిపించే శిల్పా, వారితో చాలా వెకేష‌న్ల‌లో సంద‌డి చేసిన ఫోటోలు నెట్ లో వైర‌ల్ అయ్యాయి. న‌మ్ర‌త ప్ర‌తి వ్యాప‌కంలో శిల్పా స‌హ‌కారం ఉంటుంద‌ట‌. అంటే ఆ కుటుంబంలో ఆమె పెద్ద భాగం గ‌నుక త‌ను చెప్పే విష‌యాల్లో కొత్త అంశాలు చాలా ఉంటాయి. శిల్పా శిరోద్క‌ర్ ఇప్ప‌టికే షోలో పాల్గొనేందుకు అధికారికంగా సంతకం చేశారు.

శిల్పా శిరోద్క‌ర్ 1980ల చివరలో ప్రారంభమై 1990ల వరకు న‌టిగా కొన‌సాగారు. రమేష్ సిప్పీ చిత్రం 'భ్రష్టాచార్' (1989) తన తొలి చిత్రం. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, రేఖతో కలిసి ఒక అంధ బాలికగా క‌నిపించింది. త‌ర్వాత‌ హిందీ చిత్ర పరిశ్రమలో పాపుల‌ర్ న‌టిగా స్థిరపడింది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం 'బ్రహ్మ'తో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా 'ఖుదా గవా'లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు. కొండవీటి సింహం అని పేరుతో రిలీజ్ చేసారు. ఇదే పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో యన్. టి. రామారావు. శిల్పా శిరోద్క‌ర్ చెల్లెలైన నమ్రతా శిరోద్కర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సుస్మితా సేన్ మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం నమ్రత మిస్ ఇండియాగా గెలుపొందింది. త‌ర్వాత టాలీవుడ్ కి ప‌రిచ‌యం, మ‌హేష్ తో వివాహం ఇత‌ర జ‌ర్నీ తెలిసిన‌వే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొన‌సాగుతున్న బిగ్ బాస్ లోకి శిల్పా శిరోద్క‌ర్ ప్ర‌వేశిస్తోంది. ఈ వేదిక‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News