పిక్ టాక్‌ : చీర కట్టులో అందంగా స్టార్ కిడ్‌

ఇక శివాత్మిక తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల పెద్దగా ఆఫర్లు రావడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది

Update: 2023-12-07 15:30 GMT

టాలీవుడ్‌ లో వారసులుగా హీరోలు చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. కానీ వారసత్వంతో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారిలో జీవిత రాజశేఖర్‌ దంపతుల కూతురు శివాత్మిక రాజశేఖర్‌ ఒకరు. ఈమె దొరసాని చిత్రం తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమా తో నటిగా గుర్తింపు దక్కింది కానీ కమర్షియల్‌ హిట్‌ పడలేదు.


ఇక శివాత్మిక తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల పెద్దగా ఆఫర్లు రావడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. తమిళ్‌ లేదా ఇతర భాషల్లో శివాత్మిక ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి ఆఫర్లు దక్కించుకునే స్థాయి అందం మరియు ప్రతిభ ఆమె సొంతం. అయినా కూడా శివాత్మిక తెలుగు లోనే ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే పలు సినిమాలతో నటిగా అలరించిన శివాత్మిక మరో వైపు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్‌ కి ఏమాత్రం తగ్గకుండా తన అందాన్ని నెటిజన్స్ కి చూపిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన ఫోటోతో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించి వైరల్‌ అయింది.

చీర కట్టులో శివాత్మిక గతంలో పలు ఫోటోలు షేర్‌ చేసింది. అయితే ఈసారి బ్లాక్ అండ్‌ వైట్‌ పిక్‌ షేర్‌ చేసి, అది కూడా క్లోజప్ లో లూజ్ హెయిర్‌ తో శివాత్మిక అందంగా కనిపిస్తున్న ఫోటోను జనాల ముందుకు తీసుకు వచ్చింది. ఇంత అందంగా ఉన్న శివాత్మిక కి కేవలం తెలుగు అమ్మాయి అనే ఉద్దేశ్యంతో ఆఫర్లు ఇవ్వక పోవడం ఏ మాత్రం సమంజసం కాదని నెటిజన్స్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News