శివాత్మిక.. బెడ్ పై హీటెక్కించే గ్లామర్ ట్రీట్

జీవిత రాజశేఖర్ ల ఇద్దరు కూతుళ్లు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా గుర్తింపును అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2023-11-28 01:30 GMT

అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులువేమీ కాదు. వీటితోపాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అంతే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా కలిసి రావాలి. ఇక ప్రస్తుతం ఆ దిశగా తన లక్కును పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది శివాత్మిక రాజశేఖర్. జీవిత రాజశేఖర్ ల ఇద్దరు కూతుళ్లు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా గుర్తింపును అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఇక అందులో శివాత్మిక రాజశేఖర్ కూడా కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమెకు ఇప్పటివరకు సరైన ఛాన్సులు అయితే దక్కలేదు. కానీ సోషల్ మీడియా మాత్రం గ్లామరస్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్గా అమ్మడు బెడ్ అందంగా ఫోటోలు దిగి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.


ఇక అందులో తన లెగ్స్ ఉండాల తో పాటు అందమైన చూపులతో ఫాలోవర్స్ కు మంచి గ్లామర్ ట్రీట్ అయితే ఇచ్చింది. ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలకు తప్పకుండా న్యాయం చేయగలదు అని కూడా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. గతంలో ఇంతకంటే గ్లామరస్ ఫోటోలను ఈ బ్యూటీ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలు మాత్రం అంతకుమించి అనేలా ఉన్నాయని ఫాలోవర్స్ రియాక్ట్ అవుతున్నారు.


ఇక దొరసాని సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన శివాని సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ తన టాలెంట్ తో అమ్మడు ఏదో ఒక సినిమాలో అవకాశం దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ వీలైనంతవరకు తన పాత్రలకు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.


ఇక చివరిగా అయితే ఈ బ్యూటీ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. శివాత్మిక సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆమె నటనకు మాత్రం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరి రాబోయే అమ్మడు తన గ్లామర్ కు తగ్గట్టుగా ఏమైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News