షోయబ్‌ని గట్టిగా పట్టుకో లేదంటే పారిపోతాడు!
అయితే గత సంవత్సర కాలంగా షోయబ్ మాలిక్ - సానియా మీర్జా మధ్య అంతా బాగా లేదని వార్తలు వచ్చాయి.
మాజీ పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సానియా మిర్జా నుంచి విడిపోయాడని ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే సనా జావేద్ ను పెళ్లాడాడు. 2024 జనవరి 20న ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ పాకిస్థానీ నటి.. పాకిస్తానీ క్రికెటర్ రెండు దేశాల్లో షాక్ వేవ్‌లను పంపారు. అయితే గత సంవత్సర కాలంగా షోయబ్ మాలిక్ - సానియా మీర్జా మధ్య అంతా బాగా లేదని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ జంట విడిపోయినట్టు ప్రకటించారు.
ఇంతలోనే పెళ్లయింది అంటూ కొన్ని రోజుల క్రితం షోయబ్ - సనా జంట పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయడంతో అది సంచలనంగా మారింది. పాక్ నటి సనా.. షోయబ్ ని పెళ్లాడటంతో ఇటవల తన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాల్లోను ఈ భామకు ఫాలోయింగ్ అసాధారణంగా పెరిగింది. తాజాగా సనా షోయబ్‌తో కలిసి ఉన్న ఒక పాత ఫోటోని షేర్ చేసింది. ఇంతలోనే నెటిజనులు ఈ జంటను మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. సనా జావేద్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసిన కొత్త ఫోటోలో షోయబ్‌ను గట్టిగా కౌగిలించుకుని మురిసిపోవడం కనిపించింది. ఇద్దరూ కెమెరా వైపు చూస్తూ నవ్వుతున్నారు. వారు తమ నిఖా వేడుకలో గులాబీ రంగు దుస్తులు ధరించి కనిపించారు. సనా రెడ్ హార్ట్ ఎమోజీని క్యాప్షన్‌లో జోడించింది. అయితే సనా, షోయబ్‌ల ఫోటోపై విరుచుకుపడిన వారు చాలా మందే ఉన్నారు. షోయబ్‌ను గట్టిగా పట్టుకోవాలని, లేదంటే మళ్లీ పారిపోతాడని కూడా ఓ నెటిజన్ సనాకు లేఖ రాశారు.
షోయబ్ మాలిక్ - సనా జావేద్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని కూడా నెటిజనుల్లో చర్చ సాగుతోంది. ఓ ప్రకటన చిత్రీకరణ సమయంలో సనా- షోయబ్ ఆన్ లొకేషన్ తక్షణం కలిసిపోయారని నయీమ్ హనీఫ్ సామా టీవీ ఒక కథనంలో పేర్కొంది. అంతేకాదు ఎపిసోడ్స్ షూట్ కోసం సనా జావేద్‌ని తీసుకోవాలని షోయబ్ నిర్మాతలను అభ్యర్థించాడని నెటిజనుల్లో గుసగుస వినిపించింది. అయినా అప్పట్లో ఎవరికీ అనుమానం రాలేదు. ఆ సమయంలో వారిద్దరూ తమ అప్పటి జీవిత భాగస్వాములైన సానియా .. ఉమైర్లను సంతోషంగా వివాహబంధంలో ఉన్నారు. సనా జావేద్ 2020లో గాయకుడు ఉమైర్ జస్వాల్ ని వివాహం చేసుకున్నారు. కానీ భార్య తన నుండి విడాకులు కోరినప్పుడు జస్వాల్ షాక్ అయ్యాడని కథనాలొచ్చాయి.
చాలా కాలం క్రితం ఊహించని విధంగా సనా - షోయబ్‌ల ఫోటోలు పబ్లిక్ కి రిలీజైన క్రమంలో భారత క్రీడాకారిణి సానియా మీర్జాతో షోయబ్ వివాహం ఏమైందని పాకిస్తానీలంతా ఆశ్చర్యపోయారు. భారతదేశంలోను దీనిపై చర్చ సాగింది. సానియా, షోయబ్‌లకు ఒక కుమారుడు ఉన్నాడు. షోయబ్ వివాహేతర సంబంధాలతో సానియా విసిగిపోయిందని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తోంది.