బిగ్ బాస్: శోభాశెట్టి కొత్త యాంగిల్ బయటపెట్టిన ప్రియుడు
oఅంతేకాదు.. తమ ఇద్దరిలో శోభానే తొలుత ప్రపోజ్ చేసిందని వెల్లడించి అందరిని సర్ ప్రైజ్ అయ్యేలా చేసాడు.
బిగ్ బాస్ తాజా సీజన్ లో రఫ్ అండ్ టఫ్ గా ఉండే కన్నడ బ్యూటీ శోభాశెట్టికి సంబంధించిన ఆసక్తికర.. ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయి. ఆదివారం ఎపిసోడ్ లో దీపావళికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం కలర్ ఫుల్ గా సాగింది. దీనికితోడు.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ సినిమా ప్రచారాల కోసం హౌస్ కు రాగా.. మరోవైపు టాప్ 5 కంటెస్టెంట్ల కుటుంబాల వారు రావటంతో.. ఈ మొత్తం ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో సినీ హీరో శివాజీ ఫ్యామిలీతో పాటు.. శోభాశెట్టి లవ్ స్టోరీ హైలెట్ అయ్యింది. టాప్ 5 కంటెస్టెంట్లకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు రావటం తెలిసిందే. ఈ క్రమంలో శోభాశెట్టి తండ్రితో పాటు.. ఆమె ప్రియుడు యశ్వంత్ రెడ్డి వచ్చిన వైనం ఇంట్రస్టింగ్ గా మారింది. తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ.. తాము మూడున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. తమ ఇద్దరిలో శోభానే తొలుత ప్రపోజ్ చేసిందని వెల్లడించి అందరిని సర్ ప్రైజ్ అయ్యేలా చేసాడు.
"నీకు నేను లైఫ్ లాంగ్ తోడు ఉంటాను. పెళ్లి చేసుకుంటావా?" అని అడిగిందని.. కష్టాల్లో.. సుఖాల్లో తోడుంటానని.. నీకు ఏ ప్రాబ్లంవచ్చినా తోడుంటావా? అని అడగటంతో పాటు.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగినట్లు చెప్పటం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం.. ఈ షోలో ఆమె ఎంత రఫ్ గా ఉంటుందో తెలిసిందే. అలాంటి శోభాలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? తొలుత తానే ప్రపోజ్ చేసిందా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. తాను ప్రపోజ్ చేసినప్పుడు తొలుత ఆసక్తి లేదని చెప్పానని.. కానీ.. తాను చెప్పిన వైనానికి ఎస్ చెప్పినట్లుగా చెప్పి తమ లవ్ స్టోరీని ముగించాడు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు.