హాయ్ నాన్న డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి..?

న్యాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు అంటే అతనిలో కచ్చితంగా టాలెంట్ ఉంటుంది.

Update: 2024-06-18 13:30 GMT

న్యాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు అంటే అతనిలో కచ్చితంగా టాలెంట్ ఉంటుంది. నాని ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది దర్శకులు మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఐతే కొందరు వేగంగా సినిమాలు చేస్తూ వస్తుంటే కొందరు మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్టుగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నాని హాయ్ నాన్నతో మరో నూతన దర్శకుడిని పరిచయం చేశాడు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. కియరా ఖన్నా అనే పాప కూడా ఇంప్రెస్ చేసింది.

నాని మార్క్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శౌర్యువ్ కి పరిశ్రమ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఐతే హాయ్ నాన్న తో ఫస్ట్ అటెంప్ట్ హిట్ కొట్టిన డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. తొలి సినిమానే సక్సెస్ అందుకోవడం దర్శకుల అందరి కల. అది నిజం చేసుకున్న శౌర్యువ్ నెక్స్ట్ ఎలాంటి అటెంప్ట్ చేస్తాడన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఐతే మళ్లీ హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ స్టోరీతోనే వస్తాడా లేదా డిఫరెంట్ కథతో వస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. హాయ్ నాన్న సినిమాను నాని లాంటి హీరో మాత్రమే చేయగలడు. అంతేకాదు శౌర్యువ్ దాన్ని హ్యాండిల్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది. ఇద్దరి కాంబో అలా అదిరిపోయింది. ఇక ఇప్పుడు శౌర్యువ్ సెకండ్ సినిమాపై ఆడియన్స్ ఫోకస్ పెరిగింది. అతను నెక్స్ట్ సినిమా ప్లానింగ్ ఎలా చేస్తున్నాడన్నది తెలియాల్సి ఉంది.

ఫస్ట్ సినిమా హిట్ కాబట్టి ఏ హీరోకి కథ చెప్పినా ఓకే అనేస్తారు. అంతేకాదు కథ వెరైటీగా ఉన్నా సరే హాయ్ నాన్న స్క్రీన్ ప్లేతో మెప్పించాడు కాబట్టి డౌట్ పడే ఛాన్స్ లేదు. మరి శౌర్యువ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది. అందులో హీరోగా ఎవరు చేస్తారన్నది తెలియాల్సి ఉంది. టైర్ 2 హీరోలతో శౌర్యువ్ సినిమా పడితే కచ్చితంగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ డైరెక్టర్ యువ హీరోలతో చేసినా కూడా మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News