చెప్పులకు రూ.10 కోట్లు.. ఆమె ఆస్తి లెక్క మైండ్ బ్లాంక్
బాలీవుడ్ లో భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే వారిలో శ్రద్దా కపూర్ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు
బాలీవుడ్ లో భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే వారిలో శ్రద్దా కపూర్ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఈమె ఆస్తి బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ముందు వరుసలో ఉంటుంది. గతంలో ఫోర్బ్స్ టాప్ 100 లో ఈ అమ్మడి పేరు ఉందంటే ఈమె ఆస్తి ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2011 లో లవ్ కా ది ఎండ్ సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా తర్వాత చేసిన ఆషికీ 2 తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ లభించింది. 2019 లో సౌత్ లో ప్రభాస్ కు జోడీగా నటించిన సాహో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్.
ఒక్కో సినిమాకు రూ.2.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల పారితోషికం అందుకునే శ్రద్ధ కపూర్ పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లాది పారితోషికం అందుకుంటూ ఉంది. దాంతో ఈ అమ్మడి ఆదాయం భారీగా ఉంది. తాజాగా ఈ అమ్మడి యొక్క ఆస్తుల వివరాలను ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది.
ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఆడి క్యూ 7, బెంజ్ జిఎల్ఇ, బిఎమ్డబ్ల్యూ 7 సిరీస్ కార్లు ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కారును కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇక జుహు వంటి ఖరీదైన ఏరియాలో శ్రద్ద కపూర్ కి ఇల్లు ఉంది. ఆ ఇంటి ధర రూ.60 కోట్లు ఉంటుందట. ఐ లాండ్ లో రూ.25 కోట్ల ఖరీదు చేసే ఒక బంగ్లా కూడా ఉందట.
ఇక శ్రద్ద కపూర్ కేవలం చెప్పులు మరియు షుష్ కోసం దాదాపుగా రూ.10 కోట్లు ఖర్చు చేసిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. విదేశాలకు వెళ్లిన సమయంలో కచ్చితంగా ఆమె ఖరీదైన షూస్ ను కొనుగోలు చేసి తీసుకు వస్తుందట. మొత్తంగా ఈ అమ్మడి వద్ద కోట్ల విలువ చేసే చెప్పుల కలెక్షన్ ఉందట.
ప్రస్తుత విలువ ప్రకారం ఆమెకు దాదాపు రూ.125 కోట్ల విలువ చేసే స్థిర మరియు చర ఆస్తులు ఉన్నట్లు సదరు మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. రాబోయే ఐదు ఏళ్లలో శ్రద్ద కపూర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లకు పెరిగిన ఆశ్చర్యం లేదని మీడియా వర్గాల వారు అంటున్నారు.