డేటింగ్‌ని క‌న్ఫామ్ చేసిన శ్ర‌ద్ధా?

శ్ర‌ద్ధా ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్ అభిమానులతో ఇంట‌రాక్ష‌న్ చాలా సందేహాల‌కు తెర దించాయి.

Update: 2024-03-25 17:42 GMT

బాలీవుడ్ క‌థానాయిక శ్రద్ధా కపూర్ ర‌చ‌యిత‌ రాహుల్ మోడీతో ప్రేమ‌లో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఈ జంట త‌మ‌ సంబంధాన్ని అధికారికం చేసింద‌ని భావిస్తున్నారు. శ్ర‌ద్ధా ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్ అభిమానులతో ఇంట‌రాక్ష‌న్ చాలా సందేహాల‌కు తెర దించాయి.

శ్రద్ధా రిలేష‌న్ షిప్ ఉన్న‌త‌ దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. మొదట అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌కు బయలుదేరినప్పుడు విమానాశ్రయంలో వీరిద్దరూ క‌లిసే ఫోటోలు దిగారు. కొన్ని రోజుల క్రితం వారి సంబంధానికి ఇరువైపులా కుటుంబాలు తమ ఆమోదం తెలిపాయని ఊహాగానాలు సాగాయి. ఇప్పుడు ఆశ్చర్యకరంగా శ్రద్ధా స్వయంగా రాహుల్ మోడీతో అనుబంధంపై లీకులు ఇచ్చింది. ఇటీవల అభిమానితో సంభాషణల‌ స‌మ‌యంలో శ్ర‌ద్ధా స్పంద‌న సందేహాల‌కు తావిచ్చింది.

శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంత‌రం ఇంటరాక్ట్ అవుతుంది. ఆదివారాలు అభిమానుల‌తో క్యూ అండ్ ఏ నిర్వ‌హిస్తుంది. ఫ్యాన్స్ చాలా వ‌ర‌కూ కామెంట్ సెక్షన్‌లో ట‌చ్ లో ఉంటారు. 24 మార్చి 2024న‌ అంటే ఆదివారం, శ్రద్ధా తన నైట్ సూట్‌లో బద్ధకంగా పడుకున్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఏమీ చేయకుండా ఆ రోజును ఎంజాయ్ చేయడం గురించి వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే శ్ర‌ద్ధా అంద‌మైన చిరునవ్వుతో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది మ‌రొక‌టి ఉంది. అదే త‌ను ధరించిన లాకెట్టు. శ్రద్ధా లాకెట్టు స్పష్టంగా కనిపించింది. దానిలో R అనే అక్షరం ఉంది. ఇది సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ ఇనీషియల్ అయి ఉండవచ్చనే ఊహాగానాలకు దారితీసింది.

నిజానికి R అంటే రిచ‌ర్డ్ అని ఒక అభిమాని సరదాగా ప్ర‌శ్నించ‌గా, శ్రద్ధా వెంటనే నో అని ప్రతిస్పందించింది. లాకెట్టులో ఉన్న R వేరొకదానిని సూచిస్తుంది అని తెలిపింది. తూ ఝూటీ మే మక్కర్ సెట్స్‌లో శ్రద్ధ -రాహుల్ కలుసుకున్నారు. ఈ చిత్రానికి శ్రద్ధా కథానాయిక కాగా, రాహుల్ రచయిత. స్నేహం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Tags:    

Similar News