మ్యారీడ్ బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్

దివ్య‌ అద్భుతమైన ఫ్లోర‌ల్ ఫ్రాకు ధరించిన స్టిల్.. దానికి పూర్తి భిన్నంగా మ‌రో రెండు ర‌కాల‌ డిజైన‌ర్ దుస్తుల్లోను దివ్య అందంగా క‌నిపించింది

Update: 2024-06-06 16:30 GMT

దివ్య ఖోస్లా కుమార్ తాజా చిత్రం 'సావి' ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ చిత్రం విజయం గురించి చ‌ర్చ సాగుతుండ‌గానే.. దివ్య ఖోస్లా కుమార్ ఇన్ స్టాలో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. దివ్య తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ప్ర‌ఖ్యాత‌ గ్రాజియా మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీ కోసం దివ్య ఖోస్లా కుమార్ ఇచ్చిన ఫోజులు గుబులు రేపుతున్నాయి. దివ్య ఖోస్లా స్వ‌త‌హాగానే గ‌ట్సీ అండ్ డేరింగ్ గాళ్. దానికి త‌గ్గ‌ట్టుగానే తాజా ఫోటోషూట్ లో స్ట్రైకింగ్ ఫోజుల‌తో క‌ట్టి ప‌డేస్తోంది. దివ్యా సొగసైన శైలిని అందంగా ఎలివేట్ చేయ‌డంలో ఫోటోగ్ర‌ఫీ ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించి తీరాలి.

దివ్య‌ అద్భుతమైన ఫ్లోర‌ల్ ఫ్రాకు ధరించిన స్టిల్.. దానికి పూర్తి భిన్నంగా మ‌రో రెండు ర‌కాల‌ డిజైన‌ర్ దుస్తుల్లోను దివ్య అందంగా క‌నిపించింది. ఇందులో తూనీగ త‌ర‌హాలో దివ్య స్పెష‌ల్ లుక్ కూడా ఎంతో ఇంప్రెస్సివ్ గా క‌నిపిస్తోంది. మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్, హెయిర్‌స్టైలిస్ట్ నికితా మీనన్ దివ్య స్టైలింగ్ కి అద‌న‌పు ఎలివేష‌న్ ఇచ్చారు. తాజా ఫోటోషూట్ నుంచి అంద‌మైన డిజైనర్ ఫోటోల‌పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌తి స్నాప్ వెనుక ఉన్న కళాత్మక ప్రయత్నాన్ని అభినందిస్తూ లైక్ లు, వ్యాఖ్యలతో పోస్ట్‌ను నింపారు.

Read more!

అభినయ్ డియో దర్శకత్వం వహించిన 'సావి' చిత్రంలో దివ్యా ఖోస్లా కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. అనిల్ కపూర్, హర్షవర్ధన్ రాణే త‌దిత‌రులు న‌టించారు. విశేష్ ఫిల్మ్స్ - టి-సిరీస్ ఫిల్మ్స్ ప‌తాకాల‌పై ముఖేష్ భట్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ మిశ్రా, జావేద్-మోహ్సిన్, పియూష్ శంకర్, అర్కాదీప్ కర్మకర్ ఈ చిత్రానికి స్వరకర్తలు. చిన్మే సలాస్కర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. షాన్ మొహమ్మద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ అందిస్తున్నారు. దివ్య ఖోస్లా కుమార్ ప్ర‌ముఖ నిర్మాత‌, టి సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ స‌తీమ‌ణి అన్న సంగ‌తి తెలిసిందే. ప‌లు తెలుగు చిత్రాల్లోను దివ్య న‌టించారు.

Tags:    

Similar News