పిక్‌టాక్‌ : అందాల శృతి మళ్లీ బ్లాక్‌లో మెరిసింది

తన ఫోటోలతో నెట్టింట ఎప్పుడూ అందరినీ పలకరిస్తూ ఉండే శృతి హాసన్‌ ఈసారి బ్లాక్‌ చీర కట్టుతో ఆకట్టుకుంది.

Update: 2024-11-21 09:30 GMT

కమల్‌ హాసన్‌ నట వారసురాలు శృతి హాసన్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఆ భాష ఈ భాష అనే బేధం లేకుండా, అక్కడ ఇక్కడ అనే భావన లేకుండా ఎక్కవ ఆఫర్లు వస్తే అక్కడ సినిమాలు చేసేందుకు శృతి హాసన్‌ రెడీగా ఉంటారు. నటిగా తనను తాను సంతృప్తి పరచుకునేందుకు చాలా కష్టపడే శృతి హాసన్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా షేర్‌ చేసే అందాల ఆరబోత ఫోటోలు ఆమె ఫాలోవర్స్‌కి కన్నుల విందుగా నిలుస్తూ ఉంటాయి. తన ఫోటోలతో నెట్టింట ఎప్పుడూ అందరినీ పలకరిస్తూ ఉండే శృతి హాసన్‌ ఈసారి బ్లాక్‌ చీర కట్టుతో ఆకట్టుకుంది.

శృతి హాసన్‌ ఎక్కువగా బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది. ఆమె ప్రతిసారి తన బ్లాక్‌ డ్రెస్ ఫోటోలను షేర్‌ చేసినప్పుడూ వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. తన ఫేవరేట్ కలర్స్‌లో ఒకటి అయిన బ్లాక్ లో శృతి హాసన్ కనిపించిన ప్రతిసారి ఆమె ఫ్యాన్స్‌ సైతం కళ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటారు. నెట్టింట మరోసారి అందాల శృతి హాసన్‌ బ్లాక్‌ చీర కట్టుతో మెప్పించింది. బ్లాక్‌ తో తన అందం మరింత పెరుగుతుంది అనేట్లుగా ఈ ఫోటోలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. భలే అందం, భలే ఫిజిక్ అంటూ శృతి హాసన్‌పై నెటిజన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బ్లాక్‌ చీర కట్టులో ఈ ఫోటోలను షేర్‌ చేసిన శృతి హాసన్‌... పశ్చాత్తాపం లేదు, నా అవార్డును అందుకోవడానికి ఎప్పుడూ చిన్న డ్రెస్ వేసుకున్నాను, అవళ్వికటం గౌరవానికి ధన్యవాదాలు. బలమైన, ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకమైన మహిళలతో కలిసి ఉండటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని పోస్ట్‌ పెట్టింది. శృతి హాసన్‌ తాజాగా ఒక అవార్డ్‌ వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఈ బ్లాక్ చీర కట్టులో కనిపించింది. తనకు అవార్డ్‌ను ఇచ్చిన సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫోటోలు షేర్ చేయడం జరిగింది. శృతి హాసన్‌ చీర కట్టు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే... అడవి శేష్‌తో కలిసి డెకాయిట్‌ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల అప్‌డేట్‌ చాలా ఆలస్యం అయింది. త్వరలోనే అప్‌డేట్‌ వస్తుందని శృతిహాసన్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరో వైపు సలార్‌ 2 లోనూ శృతి హాసన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు కాకుండా తెలుగులో మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. హిందీ సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. మొత్తానికి ఈమె తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Tags:    

Similar News