'సలార్' ని నేను ఎందుకు వదులుకోవాలి...?
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసిన సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే హీరోయిన్ అనే పేరు కానీ సినిమాలో ఆమె ప్రాముఖ్యత ఏమీ లేదు అనే వారు కూడా ఉన్నారు.
శృతి హాసన్ వంటి పెద్ద హీరోయిన్ ఇలాంటి ప్రాధాన్యత లేని గెస్ట్ రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ఆ సమయంలో చాలా మంది ప్రశ్నించారు. ఇప్పటికి కూడా శృతి హాసన్ గురించిన ప్రస్థావన వచ్చినప్పుడు అదే విషయాన్ని మాట్లాడేవారు ఉన్నారు. వారందరికీ కూడా శృతి హాసన్ సమాధానం ఇచ్చింది.
సలార్ లో తన పాత్ర చిన్నదే అంటూ ఒప్పుకుంటూనే.. ఒక మంచి వంటకం తయారు అవ్వాలంటే ప్రతి చిన్నది కూడా సమపాళ్లలో ఉండాలి. అందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా వంటకం రుచి పోతుంది. అలాగే సూపర్ హిట్ అవుతుందని భావించినప్పుడు సలార్ వంటి సినిమాను నేను ఎందుకు వదులుకుంటాను అంటూ ప్రశ్నించింది.
సలార్ లో నా పాత్ర తక్కువ అని నేను భావించడం లేదు. గతంలో నేను ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. చిన్న పాత్రలు చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. కనుక నేను నిడివి విషయాన్ని అసలు పరిగణలోకి తీసుకోను అన్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
సినిమా కథ లో శృతి హాసన్ కీలకం అయినా కూడా ఆమె పాత్రకు మాత్రం ప్రాధాన్యత లేదు అని విమర్శించిన వారికి సమాధానం అన్నట్లుగా సలార్ 2 లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు భావిస్తున్నారు.
ఇప్పటికే సలార్ 2 సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే ప్రభాస్ మరియు శృతి హాసన్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సలార్ 2 విడుదల అవ్వబోతుంది. మరి ఆ సినిమాలో అయినా శృతి ఫ్యాన్స్ మెచ్చే విధంగా పాత్ర నిడివి ఉంటుందేమో చూడాలి.