వీడియో: తలుపులు మూసేసి కీ మింగేసిన శ్రుతిహాసన్
జీవితంలో రెండుసార్లు బ్రేకప్ ఎలాంటి వారికైనా పెయిన్‌ఫుల్..! అలాంటి ఒక అరుదైన పరిస్థితిని ఎదుర్కొంది శ్రుతిహాసన్.
జీవితంలో రెండుసార్లు బ్రేకప్ ఎలాంటి వారికైనా పెయిన్‌ఫుల్..! అలాంటి ఒక అరుదైన పరిస్థితిని ఎదుర్కొంది శ్రుతిహాసన్. తొలుత విదేశీ ప్రియుడు మైఖేల్ నుంచి విడిపోయిన శ్రుతి, ఇప్పుడు స్వదేశీ డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికా నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. ఆ ఇద్దరితో బ్రేకప్ నిజంగానే బాధాకరం.
ఇటీవల శంతను నుంచి విడిపోయానని శ్రుతి వెల్లడించిన తీరు ఆశ్చర్యపరిచింది. శృతి వ్యక్తిగత జీవితం గురించి ఓ అభిమాని ప్రశ్నించగా దానికి స్పందిస్తూ, ``నేను అలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడాన్ని ఆనందించను.. కానీ నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను.. కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. పని చేయడం.. ఆనందించడం... ఇది చాలు?`` అని రాసింది శ్రుతి. ఈ వ్యాఖ్యానం తన బ్రేకప్ ని కన్ఫామ్ చేసింది. కొద్దిరోజులుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు సమాచారం. విడిపోయినా శ్రుతి హ్యాపీగా, తన వృత్తిపైనే దృష్టి సారించింది.
తాజాగా శ్రుతిహాసన్ తన మనసులో దాగి ఉన్న చాలా గమ్మత్తయిన సంగతులను పాట రూపంలో వెల్లడించారు. దాని సారాంశం ఇలా ఉంది. ``నేను తలుపులు మూసివేసాను.. నేను కీ మింగేశాను.. ఇకపై నాకు ఆ అవసరం ఉండదు! అని పోయెట్రీని రాసింది. దానికి సంగీతాన్ని జత చేసి శ్రుతి ఆలపించిన తీరు హృదయాలను తాకుతోంది.
తిరిగి నేను రచనల్లోకి వెళ్లాను.. అది చాలా ఉత్ప్రేరకంగా అనిపిస్తుంది. నేను వెలుతురు కోసం వెతుకుతూ ఒక గందరగోళ చెరువులో ఉన్నాను.. నేను బురద నాచు చూశాను. ఇప్పుడు మొత్తం పాటను కనుగొన్నాను.
జీవితం అద్భుతమైనది ..భయానకంగా -అందంగా ఉంటుంది. ప్రతి మాయాజాలం విలువైనది..`` అంటూ తనదైన కవితాత్మక హృదయాన్ని ఆవిష్కరించింది. దీనిని పాట రూపంలో పాడి వినిపించిన శ్రుతి హృదయాలను గెలుచుకుంది.
శ్రుతి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ కి పెయిర్ గా `ఇనిమే` అనే రొమాంటిక్ సాంగ్ (సింగిల్ ఆల్బమ్)లో కనిపించింది. ఈ పాట ఇన్ స్టంట్ హిట్ కొట్టింది. తదుపరి తలైవా 171లోను శ్రుతి కీలక పాత్రను పోషించే అవకాశం ఉందని తెలిసింది. సలార్ 2లో నటించాల్సి ఉంది. అలాగే చెన్నై స్టోరి అనే చిత్రంలోను శ్రుతిహాసన్ నటిస్తోంది.