శ్రుతి హాసన్ అన్నీ కలిపి దున్నేస్తోందే!
శ్రుతి హాసన్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. హీరోలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంది.
శ్రుతి హాసన్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. హీరోలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంది. సీనియర్ స్టార్లు..జూనియర్ స్టార్లు అంటూ ఏలాంటి బేధం లేకుండా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలా సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి. ఫాంలో ఉన్న హీరోయిన్లు కొత్త ఎంపికల విషయంలో ఎన్నో విషయాలు బేరీజు వేసుకుని సైన్ చేస్తుంటారు. కానీ శ్రుతి హాసన్ కి అలాంటి బేరీజులంటూ ఏమీ లేవు.
కొత్త ఆఫర్ వచ్చిందా? అందులో తన పాత్ర ఏంటి? నచ్చిదంటే మరో ఆలోచన లేకుండా ఒకే చేస్తుంది. ఐటం పాటలకు సైతం అడ్డు చెప్పదని ఇప్పటికే ప్రూవ్ చేసింది. ఆ మధ్య `చెన్నైస్టోరీ` అనే హాలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేసింది. కానీ అమ్మడు అనివార్య కారణాలతో ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయింది. లేదంటే? అందులోనూ శ్రుతి హాసన్ సత్తా చాటేదే? ప్రస్తుతం అమ్మడి ఖాతాలో రెండు , మూడు సినిమాలున్నాయి.
వాటిని పూర్తి చేసే పనిలో ఉంది. కొత్త అవకాశాలు వరిస్తున్నాయి. కానీ పాత్రలకు వెయిట్ ఉన్న సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఇలా వృత్తిపరంగా అమ్మడికి తిరుగులేదు.కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం మనసుకు దుఖం తప్పలేదు. ఇటీవలే రెండవ `లవ్ స్టోరీ` కూడా బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. శంతను హజారికాతో కూడా బ్రేకప్ జరిగింది. ఈ విషయంలో శ్రుతి హాసన్ పెద్దగా గాయానికి గురికాలేదు.
అప్పటికే మైఖెల్ కొర్సలేతో మొదటి లవ్ బ్రేకప్ అయింది. ఆ సమయంలో ఎంతో బాధపడింది. అతడితో లవ్ లో ఉన్నంత కాలం సినిమాలు కూడా సరిగ్గా చేయలేదు. ఆ అనుభవంతో రెండవ సారి ఆ ఛాన్స్ తీసుకోలేదు. కెరీర్..లవ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లింది. ఇప్పుడు పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. ఈ ప్రోసస్ లో జీవితానికి సంబంధించిన చాలా విలువైన విషయాలు గ్రహించింది. మునుపటి అంత వేగంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదు.