చ‌క్కెర‌ పొంగ‌లితో శ్రుతిహాస‌న్ సంక్రాంతి!

ఎందుకంటే నాన్న క‌మ‌ల్ హాస‌న్ సినిమా త‌ప్ప‌కుండా పండుగ‌ల‌కు రిలీజ్ అయ్యేదిట‌.

Update: 2024-01-14 14:30 GMT

శ్రుతి హాస‌న్ కి గ‌తేడాది బాగా కలిసొచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో అమ్మ‌డు రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. మ‌రి ఏడాది ఆరంభంలో వ‌చ్చే సంక్రాంతిని ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటుంది? అమ్మ‌డు ఎప్పుడు ప‌బ్ లు..పార్టీలే అంటుందా? ఆమెకి కూడా ఇలాంటి పండుగ‌లంటే? స‌ర‌దానా? అంటే అవుననే అంటుంది. సంక్రాంతి అంటే అమ్మ‌డికి బాల్య‌మే గుర్తొస్తుందిట‌.

అయితే అప్ప‌టిలా ఇప్పుడు ఎంజాయ్ చేయ‌డం లేదుట‌. అప్ప‌ట్లో పండ‌గ అంటే కొన్ని రోజుల ముందు నుంచే పండ‌గ వాతావ‌ర‌ణం మొద‌ల‌య్యేదిట‌. ఎందుకంటే నాన్న క‌మ‌ల్ హాస‌న్ సినిమా త‌ప్ప‌కుండా పండుగ‌ల‌కు రిలీజ్ అయ్యేదిట‌. సినిమా బృందం ఆ ఏర్పాటులో బిజీగా ఉంటే ..కుటుంబానికి కూడా అదే పండ‌గ‌లా అనిపించేదిట‌. పొంగ‌ల్ రోజున ఉదాయాన్ని నాన్న‌తో క‌లిసి సినిమా చూడ‌టం..చ‌క్కెర పొంగ‌లి తిన‌డం అనేది చాలా కాలం పాటు ఆన‌వాయితీగా కొన‌సాగించారుట‌.

అయితే శ్రుతి హాస‌న్ సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ సంద‌డి..స‌ర‌దా అంతా పోయింది అంటోంది. పండ‌గ జ‌రుపుకునే విధానం పూర్తిగా మారిపోయింద‌ని అంటోంది. ఆ రోజున బంధువుల‌తో ఫోన్లో మాట్లాడుతా అంటోంది. వీలుంటే స్వ‌యంగా క‌లిసి బ‌హుమ‌తులు అంద‌జేస్తుందిట‌. అయితే చ‌క్కెర పొంగ‌లి మాత్రం త‌ప్ప‌కుండా తింటుందిట‌. త‌న‌కిష్ట‌మైన పండ‌గ వంట‌కం మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వ‌దుట‌.

ఎక్క‌డ ఎంత బిజీగా ఉన్నా పొంగ‌ల్ రోజు మాత్రం త‌ప్ప‌కుండా చ‌క్కెర పొంగ‌లి చేయించుకుని తింటుం దిట‌. అదండి శ్రుతి హాస‌న్ సంక్రాంతి సెల‌బ్రేష‌న్ అన్న‌ది చ‌క్కెర పొంగ‌లిలో ఉంది. న‌టి అయిన త‌ర్వాత శ్రుతిహాస‌న్ లో చాలా మార్పులొచ్చాయి. పూర్తిగా పాశ్చాత్య‌ సంస్కృతికి అల‌వాటు ప‌డిన‌ట్లు తెలుస్తుంది. అమ్మ‌డికి ఖాళీ స‌మ‌యం దొరికిందంటే ప‌బ్ లు..పార్టీలంటూ బాగా ఎంజాయ్ చేస్తోందిట‌. మైఖేల్ కోర్స‌లే తో బ్రేక‌ప్ త‌ర్వాత శంత‌న్ హ‌జారికాకు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సంక్రాంతిని ప్రియుడితో ఆస్వాదిస్తుందేమో!

Tags:    

Similar News