సిద్-అదితీ ఏపీలో మొద‌టి పెళ్లి.. రాజ‌స్థాన్‌లో రెండో పెళ్లి.. భ‌లే ట్విస్టు!

ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన ఇన్‌స్టాలో అదితి రావ్ హైదరీ -సిద్ధార్థ్ వివాహ వేడుక నుండి ఫోటోలను షేర్ చేసారు. ఈ జంట‌తో కలిసి గౌర‌వ్ పోజులివ్వగా ఆ ఫోటో వైర‌ల్ అయింది.

Update: 2024-11-29 14:32 GMT

అదితి రావ్ హైదరీ -సిద్ధార్థ్ జంట‌ వనపర్తిలోని 400 ఏళ్ల పురాతన ఆలయంలో సెప్టెంబర్ 16న దక్షిణ భారతీయ సాంప్ర‌దాయంలో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఇప్పుడు ఉత్త‌రాది ట్రెడిష‌న్ లోను పెళ్లాడ‌టం చ‌ర్చ‌గా మారింది. రాజస్థాన్‌ బిషన్‌గఢ్‌లోని అలీలా ఫోర్ట్‌లో రెండోసారి ప్ర‌త్యేకంగా పెళ్లాడ‌టం ... ఈ జంట విలాసవంతమైన ఈవెంట్ నుండి ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ వేడుక‌లో ఫరా ఖాన్, మలైకా అరోరా, దుల్క‌ర్ స‌ల్మాన్ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. పెళ్లి వేడుకల్లోని ఫోటోలు, వీడియోల్లో అంద‌మైన జంట ట్రెడిష‌న‌ల్ లుక్ మ‌రింతగా ఆక‌ట్టుకుంది.

 

ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన ఇన్‌స్టాలో అదితి రావ్ హైదరీ -సిద్ధార్థ్ వివాహ వేడుక నుండి ఫోటోలను షేర్ చేసారు. ఈ జంట‌తో కలిసి గౌర‌వ్ పోజులివ్వగా ఆ ఫోటో వైర‌ల్ అయింది. నూతన వధూవరులతో హుమా ఖురేషీ - ఫరా ఖాన్‌లు 'చయ్యా చయ్యా' పాట‌కు నృత్యం చేయ‌డం క‌నిపించింది. డిజైన‌ర్ గౌర‌వ్ గుప్తా కొత్త జంటతో ఉన్న చాలా ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ తో క‌లిసి ఉన్న ఫోటో కూడా క‌నిపించింది. ముఖ్యంగా మ‌లైకా ఈవెంట్ లో షో స్టాప‌ర్ గా మార‌డ‌మే గాక‌, డిజైన‌ర్ గుప్తా బాల్డ్ హెడ్ ని ముద్దాడుతూ ఫ‌న్నీగా క‌నిపించింది.

 

 

''ఆడు సిదు ఫెయిరీ టేల్ హ్యూమన్స్ ఫెయిరీ టేల్ వెడ్డింగ్!!...అని ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ పెళ్లి వేడుక‌లో అదితి మూన్ మెహెందీ అందరి దృష్టినీ ఆకర్షించింది. తన రెండవ వివాహ వస్త్రధారణ కోసం అదితి అంద‌మైన‌ ఎంబ్రాయిడరీతో ఎరుపు రంగు బ్రైడల్ లెహంగాను ధ‌రించింది. మఠం పట్టీ, ముక్కు ఉంగరం, చెవిపోగులు, బంగారు ఆభరణాలు సహా సాంప్రదాయ భారతీయ ఆభరణాలను ధరించింది. అలంక‌ర‌ణ బావుంది.. పూల దండ ధ‌రించి చిరునవ్వుతో ఆక‌ట్టుకుంది. సిద్ధార్థ్ ఎంబ్రాయిడరీతో ఉన్న‌ ఐవరీ షేర్వానీ ధ‌రించాడు. లేయర్డ్ పెర్ల్ నెక్లెస్ రాచరికపు అప్పియ‌రెన్స్ ని ఇచ్చింది. అభయ్ వర్మ, ప్రగ్యా జైస్వాల్, అలియా భట్, నిమ్రత్ కౌర్ త‌దిత‌రులు న‌వ‌వ‌ధూవ‌రుల‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

Tags:    

Similar News