రవితేజతో రౌడి భాయ్ మాస్ ట్రీట్..
అలాగే ఈ షూట్ లో సిద్దు జొన్నలగడ్డతో పాటు రవితేజ కూడా పాల్గొంటారంట. వీరిద్దరి పైన కీలక సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కి ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూవీ మిస్టర్ బచ్చన్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. హిందీ మూవీ రైడ్ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ నెలలోనే మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాతో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని కసితో రవితేజ ఉన్నారు. హరీష్ శంకర్ నుంచి కూడా సుమారు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా రాబోతోంది.
ఆయనకి కూడా మిస్టర్ బచ్చన్ సక్సెస్ చాలా అవసరం అని చెప్పాలి. ఈ సినిమా పోస్టర్స్, వీడియో కంటెంట్ తో ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్న రౌడీ బాయ్ సిద్దు జొన్నలగడ్డ క్యామియో చేయబోతున్నాడంట. జూలై 30న సిద్దు క్యారెక్టర్ కి సంబంధించిన చిత్రీకరణ జరగబోతుందని తెలుస్తోంది.
అలాగే ఈ షూట్ లో సిద్దు జొన్నలగడ్డతో పాటు రవితేజ కూడా పాల్గొంటారంట. వీరిద్దరి పైన కీలక సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ సీన్ మిస్టర్ బచ్చన్ మూవీ క్లైమాక్స్ లో సర్ప్రైజింగ్ గా వస్తుందంట. కచ్చితంగా రౌడీ బాయ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ ఎపిసోడ్ ఉంటుందని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం సిద్దు జోనల్ గడ్డ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలలోనే నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోందంట. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ లో టిల్లు స్క్వేర్ కి సీక్వెల్ పైన కూడా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో స్టార్ట్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.