లైంగిక ఆరోపణతో పదవికి నటుడు రాజీనామా!
అయితే తాజాగా అందులో మలయాళ సీనియర్ నటుడు సిద్దిఖి ఉన్నట్లు ఆరోపించడం సంచలనంగా మారింది.
మాలీవుడ్ ని జస్టిస్ హేమ కమిటీ లైంగిక వేధింపుల నివేదిక షేక్ చేస్తోన్న వేళ మరో నటి రేవతి సంపత్ సంచలన ఆరోణలతో తెరపైకివ వచ్చిన సంగతి తెలిసిందే. 2021 లో తనపై 14 మంది చెప్పుకోలేని విధింగా హింసించారంటూ మీడియా ముందు వాపోయింది. అయితే ఆ 14 మంది పేర్లను మాత్రం ఆమె రివీల్ చేయలేదు. అయితే తాజాగా అందులో మలయాళ సీనియర్ నటుడు సిద్దిఖి ఉన్నట్లు ఆరోపించడం సంచలనంగా మారింది.
అవకాశం పేరుతో తనని వంచించాడని ఆరోపించింది. `సోషల్ మీడియా ద్వారా సిద్దిఖీ పరిచయం అయ్యాడు. తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆశ చూపాడు. ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన `సుఖమ యిరిక్కటే` చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అప్పుడు ప్రీమియర్ షోకి ఆహ్వానించాడు. సినిమా పూర్తయిన తర్వాత తిరువనంతపురంలోని మస్కట్ హోటల్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పాడ్డాడు.
ఎదురు తిరిగినందుకు ప్రతిదాడి చేసాడు. గదిలో నరకం చూపించాడు. ఆఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేదు` అని తెలిపింది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో సిద్దిఖీ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రాజీనామా లేఖను ప్రెసిడెంట్ కి అందించాడు. మరి రేవతి ఆరోపణలపై సిద్దిఖీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక వైరల్ అవుతోన్న వేళ రేవతి ఆరోపణ సంచలనంగా మారింది. నివేదిక స్పూర్తితోనే ఆమె మీడియా ముందుకొచ్చిందా? లేక ఇంకేదైనా కోణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకూ ఇండస్ట్రీపై ఎలాంటి ఆరోపణ చేయని రేవతి లైంగిక ఆరోపణలతో తెరపైకి రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.