"జాక్ - కొంచెం క్రాక్" టీజర్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. డీజే టిల్లు వంటి భారీ హిట్ తర్వాత ఆయన నుంచి ఏదైనా సినిమా వస్తే, అది కొత్తదనం ఉండాల్సిందేనని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో వస్తున్న చిత్రం జాక్ - కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. వృద్ధ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించిన వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధు కెరీర్‌లో చాలా సినిమాలు వేరియేషన్ ఉన్న పాత్రలే. జాక్ - కొంచెం క్రాక్ కూడా ఓ కొత్త తరహా కథనంతో తెరకెక్కింది. ఈసారి కథలో కొత్త కోణం చూపిస్తూ, పూర్తిగా భిన్నమైన పాత్రను సిద్ధు పోషిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఆయన ఏ పాత్రలో కనిపిస్తాడు? అసలు కథ ఏంటి? అన్నది ఇప్పటివరకు సస్పెన్స్‌గా ఉంచారు.
కానీ టీజర్ మాత్రం సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచేసింది. ఫిబ్రవరి 7న సిద్ధు పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో సీనియర్ నటుడు నరేష్ తన కుమారుడిపై ఫైర్ అవుతున్నట్టుగా మొదలవుతుంది. ఈ పాత్రలో సిద్ధు పేరు పాబ్లో నెరుడా. టీజర్ చూసినవారికి సిద్ధు పాత్ర చాలా మాసీగా, యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లా అనిపిస్తోంది.
బైక్ దొంగతనం, కిడ్నాపింగ్, అనేక రహస్య గేమ్‌లతో సిద్ధు పాత్ర భిన్నంగా కనిపిస్తోంది. సిద్ధు సరసన వైష్ణవి చైతన్య లవ్ ట్రాక్ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. సిద్ధు తన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి అలరించనున్నాడు. కామెడీ, యాక్షన్, థ్రిల్.. ఈ మూడు అంశాలను కలిపి సిద్ధు పాత్రను డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే అభిమానులు ఈ టీజర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ, సిద్ధు నుంచి మరో బ్లాక్‌బస్టర్ రాబోతుందని అంటున్నారు.
ముఖ్యంగా టీజర్‌లో చూపించిన మాస్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో, థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి స్థాయిలో జరగనుందని అంచనా. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ తనకున్న క్లాస్ టచ్‌ను పక్కన పెట్టి, పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నాడు.