టిల్లు.. ఆ మెగా ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేసినట్లు?
సినిమాలో కామెడీతో పాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.
టిల్లు స్క్వేర్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మార్చి 29వ తేదీన విడుదలైన ఈ సినిమా.. రెండు రోజుల్లోనే రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద టైర్-2 హీరోల చిత్రాల రికార్డులు బద్దలకొడుతోంది. టిల్లు రోల్ లో మరోసారి కనిపించిన సిద్ధు యాక్టింగ్ కు అంతా ఫిదా అవుతున్నారు.
సినిమాలో కామెడీతో పాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. హీరోహీరోయిన్ల మధ్య స్టోరీని దర్శకుడు నడిపించిన విధానం బాగుందని నెటిజన్లు చెబుతున్నారు. రాధిక ఎంట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీ టీమ్ ఫుల్ సక్సెస్ జోష్ లో ఉంది. ఆడియన్స్ వద్దకు వెళుతూ సందడి చేస్తోంది. ప్రేక్షకులతో ముచ్చటిస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తోంది.
ఇదంతా పక్కన పెడితే... మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ రాగా సిద్ధు రిజెక్ట్ చేశారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎక్కడా స్పందించని స్టార్ బాయ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలనుకున్నానని, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్పారు సిద్ధు. చిరంజీవి గారు ఒక సూపర్ హ్యుమన్ అని, తెలుగు ఇండస్ట్రీ అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆయన పేరేనని కొనియాడారు.
"చిరంజీవి గారితో నటించే ఛాన్స్ వస్తే.. అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి. నా పిల్లలకు నేను చిరంజీవి గారితో పని చేశానని గర్వంగా చెప్పుకోవాలి. ఆ సినిమా నా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ గా నిలవాలి. దేవుడి దయ ఉంటే నాకు మరో ఛాన్స్ కచ్చితంగా వస్తుంది. ఇండస్ట్రీలో ఎవరో ఒక డైరెక్టర్ చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రోజు వస్తుంది. ఆయన క్రేజ్ కు తగ్గట్టు సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఇలాంటి ఆఫర్ కోసమే వెయిట్ చేస్తున్నా" అని తెలిపారు.
మొత్తానికి చిరు సినిమా ఆఫర్ విషయంలో సిద్ధు ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అయితే మలయాళం సూపర్ హిట్ మూవీ బ్రో డాడీని చిరంజీవి రీమేక్ చేయాలనుకున్నారు. సినిమాలో మెగాస్టార్ కొడుకు పాత్ర కోసం శర్వానంద్ ను ఎంపిక చేశారు. శర్వా తప్పుకోవడంతో సిద్ధును సంప్రదించగా.. టిల్లు కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చిరంజీవి ఈ మూవీ రీమేక్ ను పక్కన పెట్టేశారు. అసలు ఈ రీమేక్ ఇక పట్టాలెక్కుతుందో లేదో చూడాలి మరి.