స్టార్ బాయ్ మాస్ సినిమా తీసేయొచ్చు..!
అది పక్కన పెడితే మిస్టర్ బచ్చన్ లో సిద్ధు ఎంట్రీ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మజా అందించింది. చూస్తుంటే సిద్ధు తో కూడా మంచి మాస్ సినిమా చేస్తే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.
ఎన్నేళ్ల నుంచి కష్టపడుతున్నామన్నది కాదు మనదైన ఛాన్స్ వచ్చినప్పుడు అదరగొట్టామా లేదన్నది ఇంపార్టెంట్. ఇదేదో పోకిరి సినిమాలో మహేష్ డైలాగ్ కు దగ్గరగా అనిపించినా అది నిజమే. ఛాన్స్ వచ్చినప్పుడు సత్తా చాటినోడికే ఇక్కడ క్రేజ్, ఇమేజ్ వస్తాయి. అలా కాకుండా అవకాశం వచ్చినప్పుడు వదిలి చేజారాక ఎంత ఆరాటపడినా నో యూజ్. యువ హీరోలంతా కూడా ఇప్పుడు తమకొచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ అదరగొట్టేస్తున్నారు. వారిలో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు సిద్ధు జొన్నలగడ్డ. స్టార్ బోయ్ స్క్రీన్ నేం తో సందడి చేస్తున్న సిద్ధు డీజే టిల్లు ముందు వరకు చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చాడు.
కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్ లో కూడా సిద్ధు నటించాడు. ఐతే తను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎన్నేళ్లయినా పర్లేదు అనుకుని దాదాపు 10 ఏళ్లుగా వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుని డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టాడు. టిల్లు క్యారెక్టర్ ని రాసిన దానికన్నా ఎక్కువ ఎనర్జీతో మెప్పించాడు సిద్ధు.
డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు సిద్ధు. ఐతే సిద్ధు ఇప్పుడు తెలుసుకదా, జాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.
ఐతే రీసెంట్ గా రిలీజైన మాస్ మహరాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ లో సిద్దు సర్ ప్రైజ్ క్యామియో ఇచ్చాడు. సిద్ధు తనని తాను పరిచయం చేసుకుంటూ యూత్ యువరాజ్ అంటాడు. ఆల్రెడీ సిద్ధు కి స్టార్ బోయ్ అనే స్క్రీన్ నేమ్ ఉంది మళ్లీ కొత్తగా ఈ యూత్ యువరాజ్ అని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అది పక్కన పెడితే మిస్టర్ బచ్చన్ లో సిద్ధు ఎంట్రీ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మజా అందించింది. చూస్తుంటే సిద్ధు తో కూడా మంచి మాస్ సినిమా చేస్తే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.
సిద్ధు ఇప్పటికీ టిల్లు క్యారెక్టర్ లోనే కనిపిస్తున్నాడు. ఐతే రాబోతున్న రెండు సినిమాలు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అని తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా సిద్ధుకి మంచి సక్సెస్ అందించే ఛాన్స్ ఉంది. ఇక మిస్టర్ బచ్చన్ లో సిద్ధు కామియో చూసిన ఎవరైనా అతని కోసం ఒక మంచి యాక్షన్ మూవీ సిద్ధం చేసే ఛాన్స్ ఉంటుంది. మరి సిద్ధు కూడా మాస్ పంథాలో సినిమా తీస్తే టిల్లు ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.