సైమా అవార్డ్.. వచ్చే వారికే బెస్ట్ యాక్టర్..?

దుబాయ్ లో 11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) గ్రాండ్ గా జరిగాయి.

Update: 2023-09-16 05:51 GMT

దుబాయ్ లో 11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) గ్రాండ్ గా జరిగాయి. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేస్తారు. 15న తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులను ప్రజెంట్ చేశారు. తెలుగులో బెస్ట్ యాక్టర్ గా ఎన్.టి.ఆర్, బెస్ట్ యాక్ట్రెస్ గా శ్రీ లీల అవార్డ్ గెలుచుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డును మృణాల్ ఠాకూర్ సొంతం చేసుకున్నారు.

RRR సినిమాకు గాను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ లో కొమరం భీం పాత్రలో తారక్ తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. నటుడిగా తన వర్సటాలిటీ చూపిస్తూ భీమ్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఎన్.టి.ఆర్. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటుగా రాం చరణ్ కూడా నటించాడు.

సినిమా లో ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ రోల్ చేశాడు రాం చరణ్. సినిమా సక్సెస్ లో అతని భాగం కూడా ఉంది. అయితే సైమా వారు ఎప్పుడైనా సరే వారు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలని అనుకుంటే ఆ అవార్డు ఫంక్షన్ కు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్లకు మాత్రమే బెస్ట్ యాక్టర్ గా ఇస్తారని తెలుస్తుంది. అలా అని ఎవరికి పడితే ఇచ్చేయడం కాకుండా నామినీస్ లో ఉన్న స్టార్స్ ని కాంటాక్ట్ అయ్యి వారిలో ఎవరు అవార్డ్ తీసుకునేందుకు వస్తారో వారికి అవార్డు అందిస్తారని తెలుస్తుంది.

అదేంటి అంటే సైమా అవార్డు ఫంక్షన్ దుబాయ్ లో జరుగుతుంది. అంతకుముందు ఒకసారి హైదరాబాద్ లో జరిగింది. అవార్డు రాకుండా అక్కడ దాకా మిగతా స్టార్స్ తమ టైం వేస్ట్ చేసుకుని వెళ్లే అవకాశం లేదు. అసలు మన హీరోలు మామూలు ఈవెంట్ లకే ఇద్దరు స్టార్స్ కలిసి కనిపించరు. అలాంటిది అవార్డు ఫంక్షన్ లో కనిపించడం చాలా అరుదు. అందుకే సైమా వారు కూడా మిగతా హీరోలకు ఇబ్బంది కలిగించకుండా వచ్చిన వారికే అవార్డు అంటూ ఒక కండీషన్ పెట్టారట. అలా అని RRR లో ఎన్.టి.ఆర్ పర్ఫార్మెన్స్ ని తక్కువ చేసినట్టు కాదు కొమరం భీమ్ గా ఆయన ఆ అవార్డుకు అర్హుడనే అతన్ని ఇన్వైట్ చేసి అవార్డు ఇచ్చారు.

సైమా 2023 అవార్డుల్లో RRR బెస్ట్ హీరో తారక్ అని అవార్డు ఇవ్వగా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చరణ్ కూడా బాగా చేశాడని ఇస్తే అవార్డు ఇద్దరికి ఇవ్వాలని వారు కామెంట్ చేస్తున్నారు. కానీ అక్కడ అసలు లాజిక్ ఏంటంటే ఏ హీరో అయితే అవార్డు ఈవెంట్ కు అటెండ్ అవుతాడో అతనికి మాత్రమే బెస్ట్ యాక్టర్ అవార్డు కేటాయిస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News