'సికిందర్‌' జోహ్రా జబీన్‌కి గట్టిగానే పడుతున్నాయి!

సికిందర్ నుంచి తాజాగా జోహ్రా జబీన్‌ అంటూ పాట వచ్చింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పాటను విడుదల చేసిన సమయంలో చాలా నమ్మకం వ్యక్తం చేశారు.;

Update: 2025-03-05 05:43 GMT

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ నటించిన 'సికిందర్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. తమిళ్‌ స్టార్‌ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈద్‌ సందర్భంగా విడుదల కాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు బజ్‌ క్రియేట్‌ చేయడం కోసం మేకర్స్ కిందా మీదా పడుతున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్‌ పెద్దగా బజ్‌ క్రియేట్‌ చేయలేక పోయింది. సల్మాన్‌ ఖాన్‌ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా పరమ రొటీన్‌గా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యే విధంగా టీజర్ ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. టీజర్‌కి చాలా నెగిటివిటీ వచ్చింది. అయినా మేకర్స్ పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సికిందర్ నుంచి తాజాగా జోహ్రా జబీన్‌ అంటూ పాట వచ్చింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పాటను విడుదల చేసిన సమయంలో చాలా నమ్మకం వ్యక్తం చేశారు. పండుగ సినిమా అనిపించే విధంగా పాట ఉండబోతుందని, పాట విడుదల తర్వాత సికిందర్‌ గురించి అందరి అభిప్రాయం మారబోతుందని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పాట విడుదల తర్వాత కూడా కొందరు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. పాట బాగుంది, కలర్‌ ఫుల్‌గా ఉందంటూ కొందరు పాజిటివ్‌ గా కామెంట్స్ చేస్తే కొందరు మాత్రం సోషల్‌ మీడియాలో పాటను చీల్చి చెండాడే విధంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా పాటలో సల్మాన్ ఖాన్‌ను చూపించేందుకు వాడిన వీఎఫ్‌ఎక్స్‌ను ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. సంగీతం బాగా లేదు, సాహిత్యం బలహీనంగా ఉంది, వీఎఫ్‌ఎక్స్ ఎక్కువ అయ్యాయి అంటూ చాలా మంది నెగటివ్‌గా స్పందిస్తున్నారు. ఇక సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మందన్న కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. ఇలాంటి పాటలో హీరో, హీరోయిన్‌ అందంగా ఉండటంతో పాటు అన్ని విధాలుగా బాగుంటేనే వర్కౌట్ అవుతుంది. కానీ ఈ పాటలో రష్మిక లుక్‌ బాగానే ఉన్నా సల్మాన్‌ పక్కన సెట్‌ కాలేదు అనే విమర్శలు వస్తున్నాయి. సినిమాలో కూడా ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

సికిందర్‌ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈమధ్య కాలంలో సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమాలు నిరాశ పరుస్తూ వచ్చాయి. అంతే కాకుండా మురుగదాస్ సినిమాలు సైతం పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. దాంతో అంతా రష్మిక ఈ సినిమాలో ఉండటం వల్ల లక్ కలిసి వస్తుందేమో చూడాలి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2, యానిమల్‌ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న రష్మిక లక్ కలిసి వస్తేనే తప్ప సికిందర్‌ సినిమా హిట్‌ అయ్యే పరిస్థితి లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు, ప్రేక్షకులు అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే సికిందర్‌ విడుదల వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Full View
Tags:    

Similar News