ఎంగిలి ఆపిల్ పండు రెండు ల‌క్ష‌ల‌కి అమ్మాడా?

ఇప్ప‌టికీ అదే ఇమేజ్ తో సిల్క్ స్మిత్ బ్రాండ్ ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు.

Update: 2024-08-21 22:30 GMT

ఒక‌ప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేసిన సిల్క్ స్మిత క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ స్టార్ హీరోయిన్ మించిన క్రేజ్ ని ఓ న‌ర్త‌కి ద‌క్కించుకోవ‌డం అదే తొలిసారి...చివ‌రి సారి కూడా. సిల్క్ స్మిత‌కంటే ముందు..త‌ర్వాత‌ ఎంతో మంది డాన్స‌ర్లు వ‌చ్చారు. వెళ్లారు. కానీ సిల్స్ స్మిత అయినంత ఫేమ‌స్ ఎవ‌రూ కాలేక‌పోయారు. ఇప్ప‌టికీ అదే ఇమేజ్ తో సిల్క్ స్మిత్ బ్రాండ్ ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు.

అప్ప‌ట్లో బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'డ‌ర్టీ పిక్చ‌ర్' ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమాతో విద్యాబాల‌న్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. ఆ విజ‌యంతో బాలీవుడ్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది. తాజాగా సిల్క్ స్మిత గురించి ఓఇంట్రెస్టింగ్ వెలుగులో కి వ‌చ్చింది. ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో షాట్ గ్యాప్ లో సిల్క్ స్మిత ఎర్ర‌ని ఆపిల్ పండును కొరికి తినే ప్ర‌య‌త్నం చేస్తుందిట‌.

వెంట‌నే త‌దుప‌రి షాట్ రెడీ అన‌డంతో కొరికిన పండును అక్క‌డ పెట్టి కెమెరా ముందుకు వెళ్లిపోయిందిట‌. ఇది గ‌మ‌నించిన సెట్ లో బోయ్ ఆ కొరికిన ఆపిల్ తీసుకుని సిల్క్ స్మిత కొరికిన ఆపిల్ అంటూ వేలం వేసాడుట‌. దీంతో ఆ పండును కొనేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారుట‌. ఎంతకు కొనుగోలు చేసారు? అన్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌దు కానీ ...ర‌క‌ర‌కాల వాద‌న‌లైతే ఉన్నాయి.

కొంత మంది రెండు ల‌క్ష‌ల‌కు కొన్నార‌ని, మ‌రికొంత మంది 500రూపాయ‌ల‌కు కొన్నార‌ని అంటున్నారు. మ‌రికొంత మంది 30 వేల రూపాయ‌ల‌కు ఎంగిలి ఆపిల్ ద‌క్కించుకున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా సిల్క్ స్మిత కొరికిన ఆపిల్ కి మాత్రం మంచి డిమాండ్ ప‌లికింది. దెబ్బ‌కి ఆ బోయ్ కి బాగానే కిట్టి ఉంటుంది. రూపాయి పెట్టుబ‌డి లేకుండా వ‌చ్చే ఆదాయం. అదీ సెల‌బ్రిటీకి మాత్ర‌మే ఉన్న క్రేజ్.

Tags:    

Similar News