అగ్ర హీరో కుటుంబం నుంచి డెబ్యూ నటి!

బాలీవుడ్ లోకి న‌ట‌వార‌సుల వెల్లువ కొన‌సాగుతూనే ఉంది. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. సంజ‌య్ క‌పూర్ కుమార్తె సానయా క‌పూర్.

Update: 2025-01-07 15:30 GMT

బాలీవుడ్ లోకి న‌ట‌వార‌సుల వెల్లువ కొన‌సాగుతూనే ఉంది. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. సంజ‌య్ క‌పూర్ కుమార్తె సానయా క‌పూర్.. ఇప్పుడు రవీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ .. అజ‌య్ దేవ‌గ‌న్ మేన‌ల్లుడు అమ‌న్ దేవ‌గ‌న్ బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఇప్పుడు ఇదే జాబితాలో ఖిలాడీ అక్షయ్ కుమార్ మేన‌కోడ‌లు కూడా చేరింది. ఇటీవల తన మేనకోడలు సిమర్ భాటియా బాలీవుడ్ అరంగేట్రం గురించి అక్ష‌య్ ఉద్విగ్నంగా మాట్లాడాడు. అక్షయ్ సోదరి అల్కా భాటియా కుమార్తె సిమర్. ప్రఖ్యాత ద‌ర్శ‌కుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన `ఇక్కిస్` చిత్రంలో తొలిసారిగా నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా సరసన సిమ‌ర్ న‌టిస్తోంది.

మేనకోడలు సిమర్ భాటియా బాలీవుడ్ అరంగేట్రంపై వ‌చ్చిన ఓ దిన‌ప‌త్రిక క్లిప్ ని షేర్ చేస్తూ అక్షయ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. తన ఇన్‌స్టాలో సిమ‌ర్ పోటోని కూడా షేర్ చేసాడు. ``మొదటిసారి వార్తాపత్రికలో నా ఫోటోని చూడటం గర్వించదగిన క్షణం.. కానీ నా ప్రియమైన వ్యక్తి ఇలా షైన్ అవ్వ‌డం సాటిలేని ఆనందాన్నిస్తోంది`` అని రాసాడు. ``ఆకాశమే నీ హద్దు.. నీకు నా ఆశీస్సులు ఉన్నాయి ప్రియతమా`` అని ఎమోష‌న‌ల్ నోట్ రాసాడు. సిమర్‌కు త‌న ఆశీస్సుల‌ను అందించాడు. మామ స్ఫూర్తితో బ‌రిలో దిగుతున్న సిమ‌ర్ కి ఇది ఉద్విగ్న క్ష‌ణం.

అక్షయ్ సోదరి అల్కా జీవితంలోను ఒక‌ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టం ఉంది. ఆమె మొదటి భ‌ర్తకు విడాకులిచ్చారు. మొద‌టి భ‌ర్త‌కు జ‌న్మించిన వార‌సురాలు సిమార్‌. విడాకుల తరువాత అల్కా 2012లో వ్యాపారవేత్త సురేంద్ర హీరానందనిని వివాహం చేసుకుంది. సిమర్ ఇప్పుడు క‌థానాయిక‌గా తొలి అడుగులు వేస్తోంది. ఇక్కిస్ తో తొలి ప్ర‌య‌త్నం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News