తుపాకీ తలకాయ మీద పెట్టి పాట పాడించుకున్న ఘనుడు!
పాడతావా? చస్తావా? అని బెదిరించి మరి ఓ పాటని మూడుసార్లు పాడించుకున్నాడు ఓ ప్రభుద్దుడు.
సెలబ్రిటీలు ఎవరైనా తారసపడితే వారితో సెల్పీలు దిగాలని సంబరడిపోతాం. అదే అతిధిగా ఏదైనా వివాహ వేడుకకు విచ్చేస్తే ఆహ్వానించి మంచి...మర్యాదలు చేస్తాం. కానీ ఓ గాయకుడికి వింత అనుభవం ఎదురైంది. పాడతావా? చస్తావా? అని బెదిరించి మరి ఓ పాటని మూడుసార్లు పాడించుకున్నాడు ఓ ప్రభుద్దుడు. వివరాల్లోకి వెళ్తే.. గాయకుడు సుదీర్ యదువంశీ సుపరిచితుడే.
ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన సుదీర్ ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. ఆ సమయానికి అక్కడ సంగీత కార్యక్రమం జరుగుతోంది.వధువరూల్ని ఆశీర్వదిద్దామని వేదకి మీదకు వెళ్లిన సుదీర్ ఓ వ్యక్తి సమయం ...సందర్భం లేకుండా పాడ మన్నాడు. అయితే సుదీర్ పాడటానికి అంగీకరించలేదు. ఇలాంటి వేడుకల్లో పాటలు పాడను అని వారించాడు. కుదరదని ఖరాకండీగా చెప్పేసాడు.
దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చింది. ఇంతలో వేదిక దిగి సుదీర్ కిందకు రాబోతున్నాడు. దీంతో సుదీర్ ని ఆ పాట పాడమన్న వ్యక్తి వెంబడించాడు. దగ్గరగా చేరుకుని జేబులో తుపాకీ బయటకు తీసాడు. దాన్ని సుదీర్ తలకాయకి గురిపెట్టాడు. పాడతావా? చస్తావా? అన్న రీతులో బెదిరించాడు. పాట పాడితే కిందకి దిగి వెళ్తావు..లేకపోతే మరోలా వెళ్తావ్ అని హెచ్చరించాడు. దీంతో బెదిరిపోయిన సుదీర్ వెంటనే పాట అందుకున్నాడు.
అదీ ఒక్కసారి కాదు పాడిన పాటనే మూడుసార్లు ఆ తుపాకీ బాబు పాడించాడుట. ఈ విషయాన్ని సుదీర్ స్వయంగా వెల్లడించాడు. `ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్దం కాలేదు. ఒక్కసారిగా భయపడిపోయాను. ఎలా ప్రవర్తించాలో అర్దం కాలేదు. చేసేదేమి లేక అతను ఈగోని తృప్తి పరిచేందుకు ఆ పాట పాట పాడను. ఒకసారి పాడితే కుదరదని మూడుసార్లు పాడించాడు` అని సుదీర్ తెలిపాడు. మొత్తానికి సుదీర్ వధువరూల్ని ఆశీర్వదిద్దామని వెళ్తే అలాంటి వింత అనుభవం ఎదురైంది.