ఒకే ప్రేమ్ లో స్టార్ కిడ్స్ ప్ర‌చారంతోనే స‌రిపెడ‌తారా?

తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని సుకృతి సోష‌ల్ మీడియా ద్వారా మ‌రోసారి రివీల్ చేసింది.;

Update: 2025-03-24 11:49 GMT
ఒకే ప్రేమ్ లో స్టార్ కిడ్స్ ప్ర‌చారంతోనే స‌రిపెడ‌తారా?

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కుమార్తె సుకృతి బండ్రేడి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 'గాంధీ తాత చెట్టు' జ‌న‌వరిలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఓ మంచి ప్ర‌యత్నంగా అంతా మెచ్చుకున్నారు. చ‌క్క‌ని సందేశాత్మ‌క చిత్రంగానూ నిలిచింది. రిలీజ్ కు ముందే ప‌లు అంత‌ర్జాతీయ ఫిల్మ్ పెస్టివ‌ల్స్ లో సైతం స్ట్రీమింగ్ అయింది.

అలా 'గాంధీ తాత చెట్టు'కు అంత‌ర్జాతీయం గానూ గుర్తింపు ద‌క్కింది. సుకృతికి న‌టిగా ఇదే తొలి సినిమా అయినా న‌టిగా మంచి మార్కులు వేయించుకుంది. న‌ట‌న‌లో తండ్రి సూచ‌న‌లు స‌ల‌హాలు పాటిస్తూ త‌న మార్క్ పెర్పార్మెన్స్ తో అల‌రించింది. ఈ సినిమా థియేట్రిక‌ల‌ర్ రిలీజ్ స‌మ‌యంలో టాలీవుడ్ స్టార్లు అంతా ప్ర‌చారం చేసారు. సుకుమార్ బ్రాండ్ తో సినిమాను మార్కెట్ లోకి బాగానే తీసుకెళ్లారు.

తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని సుకృతి సోష‌ల్ మీడియా ద్వారా మ‌రోసారి రివీల్ చేసింది. ఈ నేప‌థ్యంలో సినిమాని ప్ర‌మోట్ చేయ‌డానికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ -న‌మ్ర‌త‌ల కుమార్తె సితార కూడా ముందుకొచ్చింది. సుకృతి రిలీజ్ చేసిన వీడియోలోనే` గాంధీ తాత చెట్టు`ను అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి అంటూ మాట్లాడింది.

ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. స్టార్ డాట‌ర్స్ ఇద్ద‌రు ఇలా ఒక్క‌సారిగా వీడియోలో క‌నిపించే స‌రికి అభిమానులంతా స‌ర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఇదే చ‌నువుగా ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా కూడా వ‌స్తే బాగుంటుంద‌ని నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. ఇద్ద‌రికీ న‌ట‌నంటే ఆస‌క్తే. చిన్న నాటి నుంచి సినిమా వాతావ‌ర‌ణమే. ప్యూచ‌ర్ హీరోయిన్లు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి.

Tags:    

Similar News