మామ్ తో సితార సూపర్ సెల్పీ
గౌతమ్ హీరో అవుతాడా? లేదా? అన్నది సెకెండరీ..ముందు సితారని మాత్రం హీరోయిన్ గా చూసుకోవాలని అభిమా నులు భావిస్తు న్నారు.
మహేష్-నమ్రతల గారాల పట్టి సితార ఘట్టమనేని సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతుంది. జ్యూయలరీ ప్రకటన తర్వాత సితార రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకూ సితార సరదా చేష్టలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేవి. ఆ యాడ్ షూట్ తర్వాత సితారపై అభిప్రాయం ఛేంజ్ అయింది. తండ్రి వారసత్వాన్ని కొనసాగించి అగ్రనాయికగా ఎదుగుతుంది. నటిగా నమ్రత సాధించలేని విజయాలు కుమార్తె సాధిస్తుంది.
ఇది రాసిపెట్టుకునే అంశమంటూ అభిమానులంతా ఓ అంచనాకి వచ్చేసారు. గౌతమ్ హీరో అవుతాడా? లేదా? అన్నది సెకెండరీ..ముందు సితారని మాత్రం హీరోయిన్ గా చూసుకోవాలని అభిమా నులు భావిస్తు న్నారు. సితార కూడా అందుకు సంసిద్దంగానే ఉంది. సోషల్ మీడయా ద్వారా తన ఇష్టా ఇష్టాలు తెలిసిపో తున్నాయి. గ్లామర్ వరల్డ్ లో తన ఆసక్తిని చెప్పకనే చెబుతుంది.
చదువులు పూర్తయిన తర్వాత కెమెరా ముందుకొచ్చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా సితార మరో అందమైన సెల్పీతో నెట్టింట సందడి చేస్తుంది. మామ్ నమ్రతతో కారులో సెల్పీ క్లిక్ మనిపించి పోస్ట్ చేసింది. తల్లి-కూతురు ఇద్దరు నవ్వుతూ సండే రోజున దిగిన సెల్పీ ఇది. అమ్మతో అదివారం ఇలా అంటూ సితార ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
అభిమానులు ఇన్ స్టా క్వీన్ అంటూ సితారని పొగిడేస్తున్నారు. అమ్మతో అందమైన సెల్పీ అంటూ అభిమానం చాటుకుం టున్నారు. మీ ప్రతీ మూవ్ మెంట్ ని మాతో పంచుకుంటున్నందకు సంతోషం.. ధన్యవాదాలు అంటూ మరో నెటి జనుడు పోస్ట్ పెట్టారు.