తొండని చూసి భయపడిన పుష్పరాజ్!
పడటమే కాక ఆ తొండ బన్నీ కళ్లలలోకి కళ్లు పెట్టిన గుర్రున చూస్తుందిట. దీంతో బన్నీ బయపడిపోయి పెద్దగా కేకలు వేసాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొండని చూసి భయపడ్డాడా? చెట్టు మీద నుంచి గుండెల మీద పడిన తొండని చూసి బాబోయ్ అని లగెత్తాడా? అంటే అవుననే అంటున్నాడు శివ బాలాజీ. ఈ విషయం ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. `ఆర్య` సినిమా షూటింగ్ ఔట్ డోర్ లో జరుగుతోన్న సమయంలో షూట్ అనంతరం బన్నీ చెట్టు కింద పడుకుని రిలాక్స్ అవుతున్నాడుట. అలా నిద్రలోకి జారుకుంటున్నాడుట. ఇంతలో అదే చెట్టు మీద ఉన్న ఓ తొండ హఠాత్తుగా బన్నీ గుండెల మీద పడిందిట.
పడటమే కాక ఆ తొండ బన్నీ కళ్లలలోకి కళ్లు పెట్టిన గుర్రున చూస్తుందిట. దీంతో బన్నీ బయపడిపోయి పెద్దగా కేకలు వేసాడు. అందరూ వెళ్లి చూసే సరికి అది తొండ అని తేలడంతో! బన్నీకి ఇంత భయమా? అని అంతా నవ్వేసుకున్నామని శివ బాలాజీ చెప్పాడు. ఈ సంగతి చాలా కాలం నుంచి చెప్పాలనుకుం టున్నాడుట. కానీ వీలు పడటం లేదని...దీంతో ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో భాగంగా బన్నీ అనుమతి తీసుకుని ఇక దాచుకోలేనే చెప్పాల్సిందేనంటూ శివ బాలాజీ ఓపెన్ అయిపోయాడు.
దీంతో బన్నీతో పాటు అక్కడున్న ఆడియన్స్ అంతా గల్లున నవ్వేసారు. అడవి లోనూ...ఔట్ డోర్ షూటింగ్ లోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సహజం. సుకుమారంగా పెరిగిన నటుడు బన్నీ. పైగా సిటీ కల్చర్కి అలవాటు పడి ఉంటారు. కాబట్టి తొండలు..ఉడతలు..బల్లుల్ని దగ్గరగా చూడటం అన్నదే రేర్ గా జరుగుతుంటుంది. అందుకే తొండని చూసి అలా కేక పెట్టాడు. అదీ సంగతి.
ఇక ఐకాన్ స్టార్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నేడు కోట్లాది మంది అభిమానిస్తోన్న స్టార్ అతను. జాతీయ ఉత్తమ నటుడిగానూ నిలిచి తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. పాన్ ఇండియాలో బన్నీకంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. `పుష్ప-2` రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది.