150 కోట్ల కలెక్షన్స్.. నాకు ముఖ్యమే: శివకార్తికేయన్
రియల్ స్టోరీతో పాన్ ఇండియా రేంజ్ స్కేల్‌లో రూపొందిన సినిమా కావడంతో ఆరంభంలోనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
నేచురల్ యాక్టింగ్‌తో తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న హీరోనే శివ కార్తికేయన్. చాలా తక్కువ సినిమాలే చేసినా ఎనలేని క్రేజ్‌ను, మార్కెట్‌ను సొంతం చేసుకున్న అతడు.. రిజల్ట్‌ను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా వరుసగా మూవీలు చేస్తున్నాడు. కానీ, ఈ మధ్య భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో శివ కార్తికేయన్ నటించిన సినిమానే ‘అమరన్’.
మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమాను రాజ్‌కుమార్ పెరియస్వామి తీశాడు. రియల్ స్టోరీతో పాన్ ఇండియా రేంజ్ స్కేల్‌లో రూపొందిన సినిమా కావడంతో ఆరంభంలోనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేశారు.
ఎమోషనల్ స్టోరీలైన్‌తో వచ్చిన ‘అమరన్’ సినిమాకు మౌత్ టాక్ అద్భుతంగా వచ్చింది. దీనికి తగ్గట్లుగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకులు జై కొడుతున్నారు. ఫలితంగా ఇది అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇలా ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
‘అమరన్’ సినిమా సక్సెస్‌తో హీరో శివ కార్తికేయన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఈ మూవీ కలెక్షన్ల గురించి మాట్లాడాడు. ‘అమరన్ మూవీ రూ. 150 కోట్లు వసూలు చేసిందని చాలా మంది అంటున్నారు. చాలా మంది కలెక్షన్లను పట్టించుకోకపోవచ్చు. కానీ, నాకు మాత్రం అవి చాలా ముఖ్యం. ఎందుకంటే నేను భారీ బడ్జెట్ చిత్రాలు చేయాలంటే కలెక్షన్లు ఎక్కువగానే వసూలు కావాలి’ అని చెప్పుకొచ్చాడు.
శివ కార్తికేయన్ కంటిన్యూ చేస్తూ.. ‘మా నమ్మకాన్ని నిలబెడుతూ అమరన్ మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లను భారీగానే రాబట్టింది. ఇదే విషయాన్ని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సినిమాను అందరూ ఆదరించినందుకు సంతోషంగా ఉంది. నా సినిమా వసూళ్లను వేరే చిత్రాలతో పోటీగా చెప్పుకోను. తమిళ సినిమా బాగుండాలని కోరుకుంటాను’ అని వివరించాడు.
కలెక్షన్ల గురించి శివ కార్తికేయన్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అతడు చాలా కాలంగా మూవీల విషయంలో కష్టపడుతున్నాడు. అలాంటి హీరోకు మంచి కలెక్షన్లు వస్తే ఇంకాస్త ఎక్కువ స్కేల్ ఉన్న సినిమాలు చేస్తాడు. ఇప్పుడు శివ కార్తికేయన్ విషయంలోనూ ఇదే జరగబోతుంది అనేది అతడి వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు.