రెమ్యునరేషన్ తో భయపెడుతోన్న ఎస్.జె సూర్య
అయితే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ డిమాండ్ చేసాడంట. ప్రస్తుతం సూర్యకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో 2 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు ఎస్.జె.సూర్య. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో హిట్ సినిమాలని సూర్య తెరకెక్కించాడు. ఆయన కెరియర్ లో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఖుషి అని చెప్పాలి. ఈ సినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేసింది.
తరువాత మహేష్ బాబుతో నాని, పవన్ తో పులి చిత్రాలు చేసి ఎస్.జె. సూర్య డిజాస్టర్స్ కొట్టాడు. ఆ తరువాత తమిళంలో అతనే హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. తెలుగులో మాత్రం మళ్ళీ ట్రై చేయలేదు. సూర్య దగ్గర అసిస్టెంట్ లుగా కెరియర్ స్టార్ట్ చేసి డైరెక్టర్స్ అయిన మురుగదాస్, అత్లీ లాంటి వారు అతన్ని యాక్టర్ గా ఎస్టాబ్లిష్ చేశారు.
స్పైడర్ సినిమాలో సూర్య పవర్ ఫుల్ సైకో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా హిట్ కాలేదు. అయితే కోలీవుడ్ లో అతన్ని నటుడిగా బిజీ చేసిందని చెప్పాలి. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా మార్క్ అంటోనీ మూవీతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో హీరో విశాల్ తో సమానంగా రెండు భిన్నమైన పాత్రలు ఎస్.జె. సూర్య కూడా పోషించి మెప్పించాడు.
ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేసిన జిగార్తండ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే స్పైడర్ తర్వాత మరల స్ట్రైట్ తెలుగు సినిమాలో సూర్య కనిపించలేదు. ఒక మీడియం రేంజ్ హీరో మూవీ కోసం సూర్యని సంప్రదించారంట. అయితే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ డిమాండ్ చేసాడంట. ప్రస్తుతం సూర్యకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో 2 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ బడ్జెట్ బేర్ చేయడం కష్టం అని సదరు నిర్మాతలు ఇంకో ఆప్షన్ కి వేల్లిపోయారంట. సూర్య క్రేజ్ తమ సినిమాకి కలిసొస్తుందని భావించి మూవీలోకి తీసుకోవాలని ప్రయత్నం చేసారంట. అయితే ఎస్.జె.సూర్య మాత్రం రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చాడని టాక్.