తెలుగు హీరోయిన్స్ పై కామెంట్.. అసలు క్లారిటీ ఇచ్చిన SKN
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు చేసే కొన్ని మాటలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వైరల్ అవుతాయో చెప్పలేం.
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు చేసే కొన్ని మాటలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వైరల్ అవుతాయో చెప్పలేం. కొన్ని మాటలు సరదాగా అనుకున్నా అవి పెద్ద వివాదంగా మారిపోతాయి. తాజాగా నిర్మాత SKN చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, "తెలుగు భాష తెలిసిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలిసింది. అందుకే ఇకపై తెలుగు రాని హీరోయిన్స్‌కే అవకాశాలు ఇస్తాం" అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత చాలా మంది నెటిజన్లు హాట్ టాపిక్‌గా చర్చించసాగారు. ముఖ్యంగా, ఈ వ్యాఖ్యలు బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేశారా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. బేబీ సినిమా విడుదల తర్వాత వైష్ణవి ఇతర ప్రొడక్షన్ హౌస్‌లలో సినిమాలు ఒప్పుకోవడం, SKN ప్రొడక్షన్‌లో పని చేయకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే, ఈ విషయంపై SKN సోషల్ మీడియాలో స్పందించారు. "హా హా హా.. ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు., ఏం చేద్దాం చెప్పండి?" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఆయన తన వ్యాఖ్యలను సరదాగా చెప్పినట్లుగా కవర్ చేసుకున్నా, నెటిజన్ల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. కొంత మంది మాత్రం SKN గతంలో తెలుగు హీరోయిన్స్‌కు మంచి అవకాశాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
రష్మి, ఆనంది, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య వంటి వారందరికీ అవకాశం ఇచ్చిన SKN, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆయన వైష్ణవి విషయంలో అసంతృప్తితోనే ఈ కామెంట్స్ చేశారా? లేక వేరే ఉద్దేశంతో అన్నారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చగా మారిన నేపథ్యంలో SKN మరింత క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి.
బేబీ సినిమా తర్వాత SKN, వైష్ణవి మధ్య వాస్తవంగా ఏం జరిగింది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. SKN సరదాగా అనుకున్న మాటలు మరింత పెనుగులాబిగా మారాయన్నది మాత్రం ఖచ్చితం. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి. SKN మరోసారి దీనిపై క్లారిటీ ఇస్తారా లేక తాను సరదాగా అన్న మాటలు కావాలని కవర్ చేసుకుంటారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఒకవేళ SKN క్లారిటీ ఇచ్చినా, తెలుగు హీరోయిన్స్‌కు అవకాశాల విషయమై ఇండస్ట్రీలో చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.