మరోసారి బేబీ కాంబినేషన్ లో..
ఇదిలా ఉంటే దర్శకుడిగా తన నెక్స్ట్ సినిమాకి కూడా ఎస్ కె ఎన్ నిర్మాతగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు.
బేబీ సినిమాతో దర్శకుడిగా సాయి రాజేష్ హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతకు ముందు సంపూర్నేష్ బాబుతో సెటైరికల్ సినిమాలు చేసిన ఈ దర్శకుడు బేబీ మూవీతో ఫుల్ గా లైన్ లోకి వచ్చి తన మార్క్ ని పరిచయం చేశారు. అంతకుముందు కలర్ ఫోటో సినిమాని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నేషనల్ అవార్డు అందుకుంది.
బేబీ సినిమా ద్వారా ఫెయిల్యూర్ లవ్ స్టొరీని తనదైన శైలిలో దర్శకుడిగా సాయి రాజేష్ ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే దర్శకుడిగా తన నెక్స్ట్ సినిమాకి కూడా ఎస్ కె ఎన్ నిర్మాతగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు. అయితే దానికి నేను కూడా సహా నిర్మాతగా ఉంటానని చెప్పారు. నిజానికి బేబీ సినిమాని ఇద్దరం కలిసి నిర్మించాలని అనుకున్న కొన్ని కారణాల వలన పూర్తిగా ఎస్ కె ఎన్ బాద్యత తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
నెక్స్ట్ సినిమాల విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీలో ఎస్ కె ఎన్ అందరికి చెప్పేశారని, అందుకే నాకు అడ్వాన్స్ లు కూడా ఎవరూ ఇవ్వడం లేదంటూ సరదాగా కామెంట్ చేశారు. అయితే దర్శకుడిగా కంటే నిర్మాతగా ఉండటానికే తాను ఇష్టపడతానని, డైరెక్టర్ గా ఉన్న టెన్సన్ తాను తీసుకోలేనని సాయి రాజేష్ చెప్పడం విశేషం.
కాని కమిట్ అయ్యాను కాబట్టి మరో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే దర్శకుడిగా చేస్తానని సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చేశారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
అయితే మళ్ళీ ఇలాంటి ప్రేమకథతోనే సినిమాచేసే అవకాశం ఉందని టాక్. లోబడ్జెట్ లో మూవీస్ చేయాలంటే ప్రేమకథలని ఎంచుకోవాలి. ప్రస్తుతం మాత్రం దర్శకుడు, నిర్మాత బేబీ సక్సెస్ ని ఆశ్వాదిస్తున్నారని చెప్పొచ్చు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సాలిడ్ హిట్ ని ఖాతాలో వేసుకున్నట్లే. అలాగే షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్యకి హీరోయిన్ గా బేబీ ప్రమోషన్ ఇచ్చింది.