అక్షయ్ 'స్కై ఫోర్స్'.. మూవీ ఎలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. యూనిఫాం పాత్రలకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. యూనిఫాం పాత్రలకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే పలు సినిమాల్లో ఆ రోల్స్ లో మెప్పించారు. ఇప్పుడు రీసెంట్ గా స్కై ఫోర్స్ తో అలాంటి పాత్రతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిపబ్లిక్ డే స్పెషల్ గా థియేటర్లలో విడుదలైంది స్కై ఫోర్స్.
అక్షయ్ కుమార్ తోపాటు వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్, శరద్ ఖేల్కర్, మనీష్ చౌదరి తదితరులు నటించిన ఆ సినిమాకు సందీప్ కేవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దినేశ్ విజాన్, జ్యోతి దేశ్ పాండే, అమర్ కౌశిక్ కలిసి నిర్మించారు. మరి స్కై ఫోర్స్ మూవీ ఎలా ఉందంటే?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో జరిగిన వైమానిక యుద్ధం బ్యాక్ డ్రాప్ తో మూవీ అంతా సాగుతుంది. అప్పుడు మిస్ అయిన స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య పోరాటాన్ని మేకర్స్ స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పట్లో అసలేం జరిగింది? యుద్ధానికి కారణమేంటి? బొప్పయ్య మిస్ ఎందుకయ్యారు? వంటి ప్రశ్నలకు ఆన్సర్లే మూవీ.
బొప్పయ్యను పోలిన రోల్ లో వీర్ పహారియా నటించగా, ఆయన గురువైన వింగ్ కమాండర్ అహుజా పాత్రలో అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు. అయితే అక్షయ్ తన రోల్ కు న్యాయం చేశారు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. వీర్ పహారియా యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా క్యాస్టింగ్ అంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి.
అయితే డైరెక్టర్స్ మేకింగ్ తో పాటు ఎడిటర్ వర్క్ సూపర్ గా ఉంది. వీఎఫ్ ఎక్స్ వర్క్ అదిరిపోయింది. టెక్నికల్ పరంగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల క్లారిటీ లేదు. సరిగ్గా వినిపించలేదు. ఇక మూవీ ఫస్ట్ పార్ట్ అంతా ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలను గుర్తు చేస్తోంది. సెకండాఫ్ లో కథ అంతా ఉంటుంది.
ఓవరాల్ గా ఫస్ట్ టైమ్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చూసిన వాళ్లకు బాగానే స్కై ఫోర్స్ మూవీ అనిపిస్తోందని, ఇప్పటికే చూసినోళ్లకు నార్మల్ గా ఉంటుందని రివ్యూస్ వస్తున్నాయి. స్కై ఫోర్స్ మిషన్ సాగే విధానం మాత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుందని చెబుతున్నారు. ఎమోషన్ తగ్గిందని, కథ మాత్రం సూపర్ అని కొనియాడుతున్నారు.