ఫోటో స్టోరి: కాబోయే అక్కినేని కోడలు స్టన్నింగ్ ఫోజ్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత స్టైలిష్ నటీమణుల జాబితా తిరగేస్తే అందులో శోభిత పేరు టాప్‌లో ఉండాల్సిందే.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత స్టైలిష్ నటీమణుల జాబితా తిరగేస్తే అందులో శోభిత పేరు టాప్‌లో ఉండాల్సిందే. నేటితరంతో జాన్వీ, సారా, అనన్య, కియరాతో పోటీపడే సత్తా తెలుగమ్మాయి(తెనాలమ్మాయి) శోభితకు ఉంది. బీచ్ సొగసుల విశాఖ నుంచి ముంబై సహా రాజధానిలో అందాల పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకున్న అనుభవజ్ఞురాలిగా, టాప్ మోడల్ గా శోభిత ఉన్నత స్థాయిని అందుకుంది.
అది ఇప్పుడు రంగుల ప్రపంచంలో తన హవాకు అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పాలి. స్టైల్ కంటెంట్ లో శోభితను కొట్టేవాళ్లే లేరు. నటనా ప్రతిభలోను తనను మించిన వారు లేరు. అంత గొప్ప పేరు తెచ్చుకుంది. త్రిష, తమన్నా, కాజల్ లాంటి అందగత్తెలకు లేని పేరు ఇప్పుడు బాలీవుడ్ లో శోభితకు ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అంతేకాదు శోభిత నటించిన `ది నైట్ మేనేజర్` ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డ్స్ 2024 ఉత్సవాలకు వెళుతోంది. ఇలాంటి క్రెడిట్ సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన ఇతర నటీమణులకు లేదు.
ఇక ఇదే ఉత్సాహంలో శోభితలో జోష్ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. ఇటీవలే నాగచైతన్యతో నిశ్చితార్థం అనంతరం ఈ బ్యూటీ మరింతగా షైన్ అవుతోంది. తాజాగా శోభిత షేర్ చేసిన ఓ ఇన్ స్టా ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. చూడగానే స్వీట్ 16 అనిపిస్తోంది! అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. బ్లాక్ చెక్డ్ ప్యాంట్‌తో క్లాసిక్ వైట్ టాప్‌లో శోభిత స్టైలిష్ గా కనిపించింది. నల్లటి మాస్కరా, ఓపెన్ హెయిర్, బ్రౌన్ లిప్‌స్టిక్ తన గ్లామర్ ని మరింతగా ఎలివేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ లుక్ అభిమానుల సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతోంది.