శోభిత అక్కినేని.. న్యూ సర్ ప్రైజ్?

అచ్చ తెలుగమ్మాయి అయిన ఆమె.. పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా క్రేజ్ ఆమె సొంతం;

Update: 2025-03-28 11:27 GMT
Sobhita Dhulipala Hair Transformation

శోభిత ధూళిపాళ్ల.. ఇప్పుడు శోభిత అక్కినేని.. ఈ అమ్మడు గురించి అందరికీ తెలిసిందే. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆమె.. పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా క్రేజ్ ఆమె సొంతం. నటనపై ఆసక్తితో ముంబై వెళ్లి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో సందడి చేసిందని చెప్పాలి.

రామం రాఘవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత.. తన యాక్టింగ్ తో మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అట్రాక్ట్ చేసిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. 2018లో వచ్చి అందరినీ ఆకట్టుకున్న గూఢచారి మూవీతో తెలుగులో సందడి చేసింది శోభిత. అనంతరం వివిధ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంది.

రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంపాటు ప్రేమించుకున్న వారిద్దరూ గత ఏడాది చివర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే వివిధ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. శోభిత కూడా పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.

అదే సమయంలో.. శోభిత ఫ్యాషన్ సెన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఎప్పటికప్పుడు క్రేజీ అండ్ మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో ఆమె చేసే సందడి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ గా రెడీ అవుతూ ఆకట్టుకుంటూ ఉంటోంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన జట్టుకు సంబంధించి పెట్టిన ఓ పోస్ట్.. వైరల్ గా మారింది.

"నా హెయిర్ మొత్తాన్ని కత్తిరించాలా?" అంటూ పోల్ పెట్టి ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది శోభిత. చాలా మంది పూర్తిగా హెయిర్ షేవ్ చేసుకుంటుందేమోనని అనుమానపడ్డారు. బోల్డ్ సమ్మర్ మేకోవర్ అని కామెంట్స్ చేశారు. కానీ కొందరు కొత్త హెయిర్ స్టైల్ అని.. కంప్లీట్ షేవ్ కాదేమోనని సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో మరికొందరు సోషల్ మీడియా స్టంట్ అయ్యి ఉండొచ్చని, లేకుంటే మూవీ కమిట్ మెంట్ కోసమేనని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక్క పోల్ తో వార్తల్లో నిలిచింది శోభిత. ఏదేమైనా తన హెయిర్ ను ట్రిమ్ చేసినా, కట్ చేసినా సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి శోభిత పోల్ వెనుక అసలు కారణమేంటో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News