పిక్ టాక్ : అందాల హద్దులు దాటిన శోభితా
2013 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ అమ్మడు అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొంది
తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో చిన్న సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడమే గగనం అనుకుంటున్న రోజుల్లో తెనాలి అమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. బాలీవుడ్ లో సక్సెస్ ను దక్కించుకుని టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది.
2013 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ అమ్మడు అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొంది. 2016 లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం లో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 లో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
అడవి శేష్ హీరోగా నటించిన గూడాచారి మరియు మేజర్ సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ తెలుగు అమ్మాయి చేరువ అయ్యింది. హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి ప్రముఖ మేగజైన్ కోసం మినీ స్కర్ట్ ధరించి థైస్ అందాలను చూపిస్తూ విభిన్నమైన ఔట్ ఫిట్ లో అలరించింది. ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ ఈ ఫోటోలతో మరోసారి శోభితా నిరూపించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అవ్వడం వల్ల బాలీవుడ్ లో బిజీ బిజీ గా సినిమాల్లో నటిస్తుంది.
ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ అమ్మడు పొన్నియిన్ సెల్వన్ లో నటించడం ద్వారా తమిళనాట కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది.