శోభిత సంథింగ్ స్పెషల్ అనిపించేలా?
మోడ్రన్ కల్చర్ కి అలవాటు పడిన బ్యూటీ నిరంతరం అలాగే హైలైట్ అవుతుంటుంది. తెలుగు సంప్రదా యంలో కనిపించింది పెద్దగా లేదు.
తెలుగు అమ్మాయిల్లో శోభితా ధూళిపాళ రేంజ్ మాత్రం ప్రత్యేకమైనది. ఎంత మంది తెలుగు హీరోయిన్లు ఉన్నా శోభిత మాత్రం టాలీవుడ్ ని దాటి బాలీవుడ్ కి దూసుకెళ్లిన బ్యూటీ. ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ నార్త్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తుంది. అమ్మడు ఆ రకంగా ట్రెండ్ ని ఫాలో అవుతుంది కాబట్టే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ దక్కించుకుంది. పుట్టి పెరిగింది తెనాలి అయినా! అమ్మడిలో తెనాలి లక్షణాలు ఎక్కడా కనిపించవు.
మోడ్రన్ కల్చర్ కి అలవాటు పడిన బ్యూటీ నిరంతరం అలాగే హైలైట్ అవుతుంటుంది. తెలుగు సంప్రదా యంలో కనిపించింది పెద్దగా లేదు. శోభిత ఫ్యాషన్..క్యారెక్టర్ల ఎంపిక వంటివి ఆమె వ్యక్తిగత లైఫ్ ని మరింత ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి. తాజాగా శోభిత కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అమ్మడు మరోసారి ఫ్యాషన్ ఎంపికల పట్ల తానెంత ఆకర్షితురాలో ప్రూవ్ చేసింది.
ఇదిగో ఇక్కడిలా కళ్లకు అద్దాలు ధరించి.. మ్రోడన్ ప్యాట్..షర్ట్ లో ఫోర్స్ ప్యాషన్ కి సంబంధించిన బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ కనిపించింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో? ఆ మె ఫీమేల్ అని కనిపెట్టగలిగాం. లేదంటే? కనిపెట్టడం కష్టమే సుమీ అనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. శోభిత అభిమానులు మోడ్రన్ దుస్తుల్లో చూసి అంతే మురిసిపోతున్నారు.
శోభిత ఆరేడేళ్ల కెరీర్ లోనే తెలుగులో పాటు..మలయాళం సినిమాలు కూడా చేసింది. `పొన్నియన్ సెల్వన్` తో గ్రాండ్ గా కోలీవుడ్ లోనూ లాంచ్ అయింది. కానీ ఇప్పుడక్కడ అవకాశాలు వస్తున్నాయా? లేదా? అన్నది తెలియదు గానీ పొన్నియన్ తర్వాత కొత్త సినిమాలకు సంతకం చేసింది లేదు. కానీ ఇంగ్లిష్ లో మాత్రం `మంకీ మ్యాన్` అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే `సితార` అనే హిందీ సినిమా కూడా పూర్తిచేసింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.