నాగార్జునను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్

ఇక సినీ పరిశ్రమలో ఎవరు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.

Update: 2024-08-25 07:34 GMT

రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అందరిని ఆశ్చర్యం కలిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు ప్రస్తుతం కోర్టు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, ఆ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఎన్ కన్వెన్షన్ విషయంలో యజమాని, టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని గతంలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక సినీ పరిశ్రమలో ఎవరు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.

ఇక సోషల్ మీడియాలో బాబు గోగినేని పేరుతో ఉన్న ఓ ఖాతా నుంచి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సామాజిక కార్యకర్త బాబు గోగినేని బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌గా గతంలో అందరిని ఎట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నాగార్జున టాలీవుడ్‌లో హీరోగా సక్సెస్ కావడమే కాకుండా, బుల్లితెరపై కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'బిగ్‌బాస్' నుంచి 'మీలో ఎవరు కోటిశ్వరుడు' వరకు ఆయన హోస్ట్‌గా అదరగొట్టారు.

చాలా సీజన్లలో ఆయన 'బిగ్‌బాస్' షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే నాగార్జున ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 8కు హోస్ట్‌గా వ్యవహరించే సమయంలో, బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాబు గోగినేని పేరుతో ఉన్న ఓ ఖాతా నుంచి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగార్జునపై అక్రమ కట్టడాల కేసు కొనసాగుతున్నందున, ఆయనను బిగ్‌బాస్ హోస్ట్‌గా ఎలిమినేట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్ అంటూ.. అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు.. బిగ్గర్ బాస్ బాబు గోగినేని.. అని పోస్ట్ చేశారు.

ఇలాంటి పబ్లిక్ డిమాండ్లతో సోషల్ మీడియాలో చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ అకౌంట్ నిజంగా బాబు గోగినేనిదేనా లేదా కేవలం ఆ పేరును వాడుకుని వేరే వ్యక్తి పోస్టు చేశాడా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ బాబు గోగినేని తన వ్యాఖ్యల విషయంలో ఎప్పుడూ కఠినంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు బిగ్‌బాస్‌లో తన ప్రవేశంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News