నేను గ‌ర్భ‌వ‌తిని కాదు.. స్టార్ హీరోయిన్ క్లారిటీ..

''అవును.. ఇప్పుడు నేను బాగా బ‌రువు పెరిగాను. దీని అర్థం గ‌ర్భ‌వ‌తిని అని కాదు'' అంటూ క్లారిటీ ఇచ్చారు సోనాక్షి.

Update: 2024-12-12 22:30 GMT

లెజెండ‌రీ న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా న‌ట‌వార‌సురాలు, స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాను ప్రేమించిన‌ జహీర్ ఇక్బాల్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట గురించి కొన్ని నెలలుగా నిరంతరం వార్త‌లు వ‌స్తున్నాయి. ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ ఏడాది జూన్‌లో ఒక‌ట‌య్యారు. వివాహానంత‌ర సెల‌బ్రేష‌న్స్ ని కూడా సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసిన జంట అభిమానుల‌కు స‌న్నిహితంగా ఉన్నారు.

అయితే కొద్దిరోజులుగా సోనాక్షి సిన్హా గ‌ర్భిణి అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఎట్ట‌కేల‌కు ఈ పుకార్ల‌పై సోనాక్షి సిన్హా స్పందించారు. ఇటీవలి ఓ చాటింగ్ సెష‌న్ లో పెళ్లి త‌ర్వాత మీరు ఎక్కువ‌గా విందు కార్య‌క్ర‌మాల‌కు వెళ్లారా(బ‌రువును సూచిస్తూ)? అని ప్ర‌శ్నించ‌గా.. ''అవును.. ఇప్పుడు నేను బాగా బ‌రువు పెరిగాను. దీని అర్థం గ‌ర్భ‌వ‌తిని అని కాదు'' అంటూ క్లారిటీ ఇచ్చారు సోనాక్షి.

పెళ్ల‌యి నాలుగు నెల‌లే అయింది. మేం ఇంకా జీవితాన్ని ఆనందిస్తున్నాం. చాలా బిజీగా ఉన్నామ‌ని సోనాక్షి అన్నారు. ఎవ‌రో జ‌హీర్ ని అభినందించ‌డం విన్నాన‌ని కూడా సోనాక్షి అన్నారు. జ‌నం రేయింబ‌వ‌ళ్లు భోంచేస్తున్నారు (ప్ర‌చారం చేస్తున్నారు) అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది సోనాక్షి. ఈ ప్ర‌చారం ఎక్క‌డి నుంచి మొద‌లైందో కానీ.. నేను మా కుక్క పిల్ల‌తో కలిసి ఉన్న ఫోటోని వైర‌ల్ చేసారు. 'ఓ షీ ఈజ్ ప్రెగ్నెంట్' అంటూ ప్ర‌చారం మొద‌లెట్టారు. అస‌లు ఆ ఫోటోకి నా ఫ్రెగ్నెన్సీకి ఏంటి సంబంధం? అని కూడా వాపోయారు సోనాక్షి.

అయితే ఈ అంద‌మైన జంట వివాహం అయిన వెంటనే ఓ క్లినిక్ నుంచి వెళుతూ కనిపించడంతో సోనాక్షి గర్భం దాల్చినట్లు పుకార్లు మొదలయ్యాయి. తరువాత కొత్త జంట ఫోటోలో సోనాక్షి రూపం కూడా ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. అక్టోబర్‌లో సోనాక్షి తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి ఉన్న‌ ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె తన కుక్కను చేతుల‌తో పట్టుకుని 'గెస్ ది వూకీ' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఆ వెంట‌నే సోనాక్షి గ‌ర్భ‌వ‌తి అని ప్ర‌చారం మొద‌లైంది. చాలా మంది కామెంట్ సెక్షన్‌లో ఈ జంటను అభినందించడం ప్రారంభించారు.

సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ ఏడేళ్ల డేటింగ్ తర్వాత జూన్ 23న కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లితో ఒక‌ట‌య్యారు. ఈ వేడుకకు అంద‌మైన జంట‌ సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ ప్ర‌ముఖుల కోసం భారీ రిసెప్షన్ జ‌రిగింది.

Tags:    

Similar News