సీనియర్ తో దురుసుగా ప్రవర్తించిన స్టార్ కిడ్!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా క్షమాపణలు చెప్పింది. 'నాకు మనీషా కోయిరాలా అంటే ఎంతో ఇష్టం. హీరామండి సిరీస్ చూసిన తర్వాత ఆమెకి క్షమాపణలు చెప్పాను.
ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తున్నారంటే? వాళ్లిద్దరి మధ్య తగ్గాఫ్ వార్ తప్పనిసరి. ది బెస్ట్ అనిపించుకోవడం కోసం పోటాపోటీగా నటిస్తుంటారు. ఒక్కోసారి అది బ్యాలెన్స్ తప్పిందంటే వ్యక్తిగత వివాదాలకు దారి తీస్తుంటుంది. అలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేస్తున్నాయి. తాజాగా సెట్స్ లో దురుసుగా ప్రవర్తించడంతో స్టార్ వారసురాలు సోనాక్షి సిన్హా సీనియర్ నటి మనీషా కోయిరాలకు క్షమాపణలు చెప్పిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీరిద్దరు కలిసి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'హీరామండి'లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన వెబ్ సిరీస్ మంచి విజయం సాధించింది. విదేశాల్లో సైతం సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా క్షమాపణలు చెప్పింది. 'నాకు మనీషా కోయిరాలా అంటే ఎంతో ఇష్టం. హీరామండి సిరీస్ చూసిన తర్వాత ఆమెకి క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో భాగంగా మనీషాతో దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది.
సిరీస్ చూసిన తర్వాత అలాంటి నటితో వాటిని ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే సారీ చెప్పాను. ఆమె ఎంతో గొప్ప నటి. సహ నటిని ప్రోత్సహిస్తారు. షూటింగ్ ఎంతో గొప్పసాగా సాగింది. అంత గొప్ప నటితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ ఆమెతో కలిసి పనిచేసే రోజు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా. సంజయ్ సినిమాల్లో నటించడం పెద్ద కష్టం కాదు. అన్నీ ఆయన ముందే చెప్పేస్తారు. భన్సాలీ మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను.
నా కెరీర్ లో గొప్ప ప్రశంసగా మిగిలిపోతుంది. మంచి పాత్ర ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడే ఉంటాను' అని అన్నారు. హీరామండిలో సోనాక్షి సిన్హా డ్యూయల్ రోల్ లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆహార్యం, నటన ప్రతీది ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తొలిసారి నెగిటివ్ పాత్ర పోషించింది. ఆ పాత్ర ఆమెకి ఇంత గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇదే సిరీస్ లో వాళ్లతో పాటు అతిది రావు హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.