లాక్మే వీక్‌లో చెలరేగిపోయిన సోనాల్
ప్రస్తుతం సోనాల్ ర్యాంప్ వాక్ కి సంబంధించిన వీడియో లాక్మే ఫ్యాషన్ వీక్ ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది.
సోషల్ మీడియాల్లో స్పీడ్ చూపించే కథానాయికల్లో సోనాల్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఫ్యాషన్ ఈవెంట్లు, ఫోటోషూట్లతో ఇన్ స్టా అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ -2024 ఈవెంట్లో సోనాల్ గుబులు రేపే ఫోజులు కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీట్ గా మారాయి. ఈవెంట్లో వన్ ఇన్ఫినిట్ కోసం సోనాల్ 5వ రోజున సెజల్ కామ్‌దార్ డిజైనర్ లెహంగాను వేదికపై ప్రదర్శించారు. దీనికి వన్ ఇన్ ఫైనైట్, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, అల్టిమేట్ ఫేస్ డెఫినేషన్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించారు.
ప్రస్తుతం సోనాల్ ర్యాంప్ వాక్ కి సంబంధించిన వీడియో లాక్మే ఫ్యాషన్ వీక్ ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది. సాంప్రదాయ డిజైనర్ టాప్, ట్రెడిషనల్ బాటమ్ లో సోనాల్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోందంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సోనాల్ కథానాయికగా కెరీర్ ప్రారంభమై ఇప్పటికే 15 సంవత్సరాలైంది. ఇమ్రాన్ హష్మీ జన్నత్ (2008)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత సౌత్ లో అడుగుపెట్టింది. టాలీవుడ్ లో రాహుల్ సరసన `రెయిన్ బో` అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలయ్య సరసన వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే నాగార్జున `ఘోస్ట్` లోను నటించింది. కానీ ఈ బ్యూటీకి లక్ ఫేవర్ చేయలేదు. అగ్ర హీరోలతో సినిమాలు కూడా తన ఫేట్ ని మార్చలేకపోయాయ. ఇప్పుడు కంబ్యాక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ టాలీవుడ్ దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
సింగిల్ ఆల్బమ్స్‌తో ప్రయత్నం:
సోనాల్ చౌహాన్ ఇటీవల వీడియో ఆల్బమ్స్‌లోను నటించింది. తాహా షా మ్యూజిక్ వీడియో `జెహెర్ మొహబ్బత్`లో నటించింది. ఘాడమైన ప్రేమలో సంచార జంటగా ఇందులో సోనాల్- తాహాషా కనిపిస్తున్నారు. సోనాల్ ఎమోషనల్ లవ్ జర్నీని ఈ వీడియో ఆవిష్కరించనుంది. ప్రేమ దుర్భలమైనది. దానిని సాధించుకోవాలంటే పోరాడాల్సిందే. సోనాల్ తన ప్రియుడు ఎలాంటి పోరాటం సాగించారన్నది పాట థీమ్. ఈ పాటకు గాత్రాన్ని అఫ్సానా ఖాన్ అందించారు.